Gold Price Crash: ప్రపంచవ్యాప్తంగా కుప్పకూలిన బంగారం మార్కెట్ విలువ.. ఒకే రోజులో సంచలన రికార్డు!

Gold Price Crash: ప్రపంచ బంగారం మార్కెట్ గతంలో ఎన్నడూ చూడని రీతిలో అత్యంత భీకరమైన ఒడుదొడుకులకు లోనైంది.

Update: 2026-01-30 08:30 GMT

Gold Price Crash: ప్రపంచ బంగారం మార్కెట్ గతంలో ఎన్నడూ చూడని రీతిలో అత్యంత భీకరమైన ఒడుదొడుకులకు లోనైంది. గురువారం ట్రేడింగ్ సెషన్‌లో పసిడి మార్కెట్ విలువ ఏకంగా 5.5 ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ. 460 లక్షల కోట్లు) మేర హెచ్చుతగ్గులకు గురై ఇన్వెస్టర్లను వణికించింది. 2008 ఆర్థిక మాంద్యం సమయంలో కూడా ఈ స్థాయి కల్లోలం చూడలేదని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

నిమిషానికి రూ. 5 లక్షల కోట్లు ఆవిరి! ప్రముఖ క్యాపిటల్ మార్కెట్స్ ప్లాట్‌ఫామ్ ‘ది కోబెయిసీ లెటర్’ వెల్లడించిన వివరాల ప్రకారం.. గురువారం రాత్రి భారత కాలమానం ప్రకారం 8 నుంచి 9 గంటల మధ్య బంగారం మార్కెట్ విలువలో భారీ పతనం సంభవించింది. కేవలం ఆ ఒక్క గంటలోనే 3.2 ట్రిలియన్ డాలర్ల సంపద కరిగిపోయింది. అంటే సగటున నిమిషానికి 58 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 5 లక్షల కోట్లు) ఆవిరయ్యాయి.

మళ్ళీ అనూహ్యంగా పుంజుకున్న ధర: అయితే ఈ నష్టాల పరంపర ఎంతో సేపు కొనసాగలేదు. పతనం తర్వాత మళ్ళీ కొనుగోళ్ల మద్దతు లభించడంతో మార్కెట్ ముగిసే సమయానికి విలువ తిరిగి 2.3 ట్రిలియన్ డాలర్లకు పైగా పెరిగింది. మొత్తంగా చూస్తే ఒకే రోజులో పసిడి విలువ 5.5 ట్రిలియన్ డాలర్ల మేర అటు ఇటుగా ఊగిసలాడి సరికొత్త రికార్డు సృష్టించింది.

ఈ కల్లోలానికి కారణాలేంటి? పసిడి మార్కెట్ ఇలా అదుపుతప్పడానికి విశ్లేషకులు పలు కారణాలను విశ్లేషిస్తున్నారు:

లాభాల స్వీకరణ: బంగారం ధరలు గరిష్ఠ స్థాయిల వద్ద ఉండటంతో సంస్థాగత ఇన్వెస్టర్లు ఒక్కసారిగా అమ్మకాలకు మొగ్గు చూపారు.

అల్గారిథమ్ ట్రేడింగ్: నేటి మార్కెట్లో కంప్యూటర్ ఆధారిత 'ఆటోమెటిక్ అల్గారిథమ్ ట్రేడింగ్' వల్ల ధరల్లో కదలికలు చాలా వేగంగా సంభవిస్తున్నాయి.

భౌగోళిక ఉద్రిక్తతలు: వాణిజ్య యుద్ధ భయాలు, వడ్డీ రేట్లపై అస్పష్టత ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగించాయి.

ETFల ప్రభావం: ప్రస్తుతం బంగారం ధరలు కేవలం భౌతిక డిమాండ్ మీద కాకుండా, గోల్డ్ ఈటీఎఫ్‌ల (ETFs) లావాదేవీల మీద ఎక్కువగా ఆధారపడి ఉండటం కూడా ఈ తీవ్ర ఒడుదొడుకులకు కారణమవుతోంది.

బంగారంతో పాటు వెండి, ప్లాటినం లోహాలు కూడా నిన్నటి ట్రేడింగ్‌లో భారీ హెచ్చుతగ్గులను ప్రదర్శించాయి. ఈ పరిణామాలు సాధారణ మదుపర్లలో కలవరం కలిగిస్తున్నాయి.

Tags:    

Similar News