Agricultural Terrorism: పెరిగిపోతున్న ముప్పు.. వ్యవసాయ ఉగ్రవాదం

Agricultural Terrorism: దేశ ఆహారభద్రతపై ముప్పుగా మారుతున్న వ్యవసాయ ఉగ్రవాదం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరు ఆలోచించాల్సిన విషయం.

Update: 2025-06-09 02:42 GMT

Agricultural Terrorism: పెరిగిపోతున్న ముప్పు.. వ్యవసాయ ఉగ్రవాదం

Agricultural Terrorism: దేశ ఆహారభద్రతపై ముప్పుగా మారుతున్న వ్యవసాయ ఉగ్రవాదం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరు ఆలోచించాల్సిన విషయం. పంటలు,పశువులపై సూక్ష్మజీవులు, వైరస్‌లు, ఫంగస్‌లను ఉద్దేశపూర్వకంగా వదిలి, దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని పరిశోధనలు చెబుతున్నాయి.

వ్యవసాయ ఉగ్రవాదం అంటే పంటలు లేదా పశువులపై హానికరమైన సూక్ష్మజీవులు లేదా వైరస్‌లను ఉద్దేశపూర్వకంగా వదలడం. దీని లక్ష్యం ఆహార ఉత్పత్తులను ధ్వంసం చేయడం, ఆర్థిక వ్యవస్థను అస్థిరపరచడం. 2020లో DRDO కోసం నిర్వహించిన అధ్యయనం ప్రకారం, ఇది సామాన్య వ్యవసాయ నేరాలకంటే చాలా ప్రమాదకరం.

ఇదంతా చూస్తే, జీవ ఉగ్రవాదం కొత్త కాదు. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో జర్మనీ.. బ్రిటన్ పంటలపై పురుగుల దాడికి వేసిన ప్రణాళికనే దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా జంతువులపై ఇలాంటి దాడులు నమోదయ్యాయి అవుతూనే వున్నాయి. ఇవి జంతువుల ఉత్పత్తి సామర్థ్యాన్ని పూర్తిగా క్షీణింపజేస్తాయి.

ఈ ముప్పు మనుషులపైనా ప్రభావం చూపగలదు. ఇటీవల చైనాలో వెలుగులోకి వచ్చిన ఫంగస్ వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తాయని అగ్రదేశాలు హెచ్చరిస్తున్నాయి. అంతేగాక ఇది వందల కోట్ల రూపాయల ఆర్థిక నష్టాలకు కారణం కావచ్చు.

అయితే భారత్ వ్యవసాయంపై ఎక్కువగా ఆధారపడే దేశం. ఇక్కడి పంటలు, ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో బయటి దేశాల నుంచి వచ్చే ఫంగస్, వైరస్, బ్యాక్టీరియా దేశానికి ముప్పుగా మారవచ్చు. అమెరికా నుంచి దిగుమతి చేసిన గోధుమలతో వచ్చిన లాంటానా కెమారా మొక్క దీనికి ఉదాహరణ. అది ఇప్పుడు దేశమంతటా వ్యాపించి పర్యావరణానికి హాని కలిగిస్తోంది.

ఇటీవల మామిడి ఎగుమతుల ఉదంతం కూడా మనకు ఒక హెచ్చరికే. కాయలపై తెగులు ఉన్నందుకు అమెరికా వాటిని తిరస్కరించింది. ఈ నేపథ్యంలో మనకు బలమైన నిఘా వ్యవస్థ, శుద్ధత ప్రమాణాలు ఎంతో అవసరం.

ఆహార భద్రత, ఒక దేశ భద్రత రెండు సమానమే. పంటలను, పశువులను కాపాడే చర్యలు తీసుకోకపోతే, ఈ ముప్పు మన భవిష్యత్‌ తరం జీవనాధారాలను గంభీరంగా ప్రభావితం చేయవచ్చు. వ్యవసాయ ఉగ్రవాదాన్ని ఆషామాషీగా తీసుకోకూడదు. ఇప్పుడు తీసుకునే జాగ్రత్తలే రేపటి తరాలకు రక్షణ.

Tags:    

Similar News