Tata Sons: ఎయిర్ ఇండియాను దక్కించుకున్న టాటా సన్స్

* నష్టాల్లో ఉన్న సంస్థను సొంతం చేసుకున్న టాటా సన్స్ * ఎయిర్‌ ఇండియాకు 63,113 కోట్ల అప్పులు

Update: 2021-10-01 07:45 GMT

ఎయిర్ ఇండియాను దక్కించుకున్న టాటా సన్స్ (ఫైల్ ఫోటో)

Tata Sons: మరోసారి ప్రభుత్వ సంస్థ ఎయిర్ ఇండియాను టాటా సన్స్ దక్కించుకుంది. నష్టాల్లో ఉన్న సంస్థను టాటా సన్స్ చేజిక్కించుకుంది. భారత్‌లో ఇప్పటికే టాటా గ్రూప్ సంస్థ రెండు ఎయిర్ లైన్స్ నిర్వహిస్తోంది. వీటిలో ఒకటి సింగపూర్ ఎయిర్ లైన్స్, ఇంకొకటి ఎయిర్ ఏసియాతో జాయింట్ వెంచర్. అప్పుల ఊబిలో కూరుకుపోయిన విమానయాన సంస్థకు అత్యధిక బిడ్ సమర్పించింది టాటా సన్స్. బిడ్ పై త్వరలో అధికార ప్రకటన వెలువడనుంది.

68 ఏళ్ల తర్వాత మళ్లీ ఎయిర్ ఇండియా బిడ్‌ను టాటా సన్స్ గెలుచుకుంది. 1932లో టాటా ఎయిర్ సర్వీసెస్ ప్రారంభించారు JRD టాటా. 1938లో టాటా ఎయిర్‌లైన్స్‌గా పేరును మార్చారు. 1953లో ఎయిర్ ఇండియాను జాతికి అంకితం చేశారు. ప్రస్తుతం ఈ సంస్థకు సుమారు 63వేల 113 కోట్ల అప్పులు ఉన్నాయి. డిసెంబర్‌ లోగా ఎయిర్ ఇండియాను టాటా సన్స్‌కు కేంద్రం అప్పగించనున్నట్లు తెలుస్తోంది.

Full View


Tags:    

Similar News