దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల ర్యాలీ..

*గ్లోబల్ మార్కెట్ల సానుకూల సంకేతాల నేపధ్యం... *వరుసగా రెండో రోజు లాభాల్లో దేశీ స్టాక్ మార్కెట్లు ..

Update: 2021-01-20 15:00 GMT

 దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల ర్యాలీ కొనసాగిస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్ల సానుకూల సంకేతాల నేపధ్యంలో వరుసగా రెండో రోజు దేశీ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. మార్కెట్ ముగిసే సమయానికి బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్ 400 పాయింట్ల లాభం నమోదు చేయగా. నిఫ్టీ 14,650 పాయింట్లకు దిగువన స్థిరపడ్డాయి. సెన్సెక్స్ 393 పాయింట్లు జంప్‌ చేసి 49,792 వద్ద, నిఫ్టీ 123 పాయింట్లు ఎగసి 14,644 వద్ద స్థిరపడ్డాయి. అమెరికాలో భారీ ఉద్దీపన ప్యాకేజీ ప్రకటన నేపధ్యంలో ఏషియా మార్కెట్లు రికార్డు స్థాయి గరిష్ఠాలకు చేరుకోగా అవే సంకేతాలను దేశీ సూచీలు అందిపుచ్చుకున్నాయి. మరోవైపు విదేశీ మదుపర్ల నిరవధిక పెట్టుబడులు కార్పొరేట్‌ కంపెనీల త్రైమాసిక ఫలితాలు వెరసి సూచీలు దూకుడుగా సాగాయని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Tags:    

Similar News