Stock Market: మార్కెట్‌లో మొదలైన 'ట్రంప్' జోష్.. భారీ లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీ! లక్షల కోట్ల లాభం

గత కొద్దిరోజులుగా నష్టాల్లో ఉన్న స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా పుంజుకున్నాయి. యూరోపియన్ యూనియన్ మరియు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన సానుకూల ప్రకటనలతో సెన్సెక్స్ 750 పాయింట్లకు పైగా లాభపడగా, నిఫ్టీ 25,000 మార్కును అధిగమించింది. ఇన్వెస్టర్ల సంపద భారీగా పెరగడంతో దలాల్ స్ట్రీట్‌లో జోష్ కనిపిస్తోంది.

Update: 2026-01-22 06:05 GMT

గత కొన్ని రోజులుగా నష్టాల సుడిగుండంలో చిక్కుకున్న భారతీయ స్టాక్ మార్కెట్లు ఎట్టకేలకు ఊపిరి పీల్చుకున్నాయి. అంతర్జాతీయంగా చోటుచేసుకున్న సానుకూల పరిణామాలతో గురువారం దలాల్ స్ట్రీట్‌లో బుల్ జోరు పెరిగింది. యూరోపియన్ యూనియన్ (EU) మరియు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి వచ్చిన కీలక ప్రకటనలు ఇన్వెస్టర్లలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి.

మార్కెట్‌కు బూస్ట్ ఇచ్చిన కారణాలివే..

మార్కెట్ పతనానికి కారణమైన గ్రీన్‌లాండ్ వివాదం సద్దుమణగడం, అంతర్జాతీయ ఉద్రిక్తతలు తగ్గడం సూచీలకు కలిసొచ్చింది. ముఖ్యంగా:

భారత్-ఈయూ బంధం: భారత్‌తో వ్యూహాత్మక, ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసుకుంటామని యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా లేయెన్ ప్రకటించడం మార్కెట్‌కు పెద్ద ఊరటనిచ్చింది.

ట్రంప్ ప్రకటన: దావోస్ పర్యటనలో ఉన్న ట్రంప్.. భారత్-అమెరికా మధ్య అతి త్వరలో భారీ వాణిజ్య ఒప్పందం కుదురుతుందని ప్రకటించడం ఇన్వెస్టర్ల నమ్మకాన్ని పెంచింది.

నేటి మార్కెట్ పరిస్థితి (ఉదయం గణంకాలు):

ప్రారంభం నుంచే లాభాల బాట పట్టిన సూచీలు ప్రస్తుతం రికార్డు స్థాయి దిశగా దూసుకెళ్తున్నాయి.

సెన్సెక్స్ (Sensex): 755 పాయింట్లు లాభపడి 82,683 వద్ద ట్రేడ్ అవుతోంది.

నిఫ్టీ (Nifty): 241 పాయింట్ల లాభంతో 25,398 వద్ద కొనసాగుతోంది.

లాభాల్లో ఉన్న టాప్ షేర్లు:

మార్కెట్ గ్రీన్‌లో ఉండటంతో దాదాపు అన్ని రంగాలు లాభాల్లోనే ఉన్నాయి. ప్రధానంగా నిఫ్టీలో ఈ కింది కంపెనీలు అదరగొడుతున్నాయి:

ఎటర్నల్ (జొమాటో)

డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్

టాటా మోటార్స్

ఆసియన్ పెయింట్స్

అదానీ ఎంటర్‌ప్రైజెస్

నష్టపోయినవి: నెస్లే, అల్ట్రాటెక్ సిమెంట్, మాక్స్ హెల్త్‌కేర్ మరియు ఎన్‌టిపిసి స్వల్పంగా నష్టపోయాయి.

Tags:    

Similar News