Stock Market: నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు..

Stock Market: సెన్సెక్స్‌ 500 పాయింట్లు డౌన్‌

Update: 2023-03-09 11:56 GMT

Stock Market: నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు 

Stock Market: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నష్టాల్లో ముగిశాయి. వడ్డీ రేట్ల పెంపుపై అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ ఛీఫ్‌ జెరోమ్‌ పావెల్‌ చేసిన వ్యాఖ్యలు.. అంతర్జాతీయ మార్కెట్లను ప్రభావితం చేశాయి. అమెరికాతో పాటు కేంద్ర బ్యాంకులు మరోసారి వడ్డీ రేట్లు పెంచుతాయన్న అంచనాల నేపథ్యంలో ప్రధాన మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. దీని ప్రభావం మన మార్కెట్లపైనా పడింది.

సెన్సెక్స్‌ దాదాపు 500 పాయింట్ల మేర నష్టపోగా.. నిఫ్టీ 17వేల 600 స్థాయి దిగువన ముగిసింది. దీంతో మూడు రోజుల లాభాలకు తెరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 82.02గా ఉంది. ఉదయం 60వేల 467 వద్ద స్వల్ప లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్‌.. కాసేపటికే నష్టాల్లో జారుకుంది. మధ్యాహ్నం తర్వాత అమ్మకాల వెల్లువెత్తడంతో మరింత నష్టాల్లోకి జారుకుంది. చివరికి 541.81 పాయింట్ల నష్టంతో 59వేల 806.28 పాయింట్ల వద్ద ముగిసింది.

Tags:    

Similar News