Stock Market: లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు
Stock Market: 61,045.74 దగ్గర స్థిరపడిన సెన్సెక్స్.. 112. పాయింట్లు పెరిగి 18,165.35 వద్ద ముగిసిన నిఫ్టీ
Stock Market: లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండోరోజూ లాభాల్లో ముగిశాయి. ఉదయం ఆరంభంలో కాస్త తడబడ్డ సూచీలు ..తర్వాత పుంజుకొని ఇంట్రాడే గరిష్టాలకు చేరుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు మార్కెట్లకు సపోర్టుగా నిలిచాయి. మరోవైపు కీలక షేర్లలో కొనుగోళ్లు కలిసొచ్చాయి. రేపు వీక్లీ ఎక్స్‌పైరీ, కేంద్ర బడ్జెట్‌పై అంచనాలు, డిసెంబరు త్రైమాసిక ఫలితాలు కూడా మార్కెట్లపై ప్రభావం చూపాయి. ఉదయం 60వేల716.03 వద్ద లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్ చివరకు 390.02 పాయింట్ల లాభంతో 61వేల45.74 దగ్గర స్థిరపడింది. 18వేల74.30 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైన నిఫ్టీ చివరకు 112.05 పాయింట్లు లాభపడి 18వేల165 . 35 వద్ద ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 81.29 వద్ద నిలిచింది.