Sensex Today: ఐదు రోజుల నష్టాలకు బ్రేక్.. భారీ లాభాల్లోకి దూసుకెళ్లిన సెన్సెక్స్
Stock Market Today: ఐదు రోజుల నష్టాల తర్వాత స్టాక్ మార్కెట్ పుంజుకుంది.
Sensex Today: ఐదు రోజుల నష్టాలకు బ్రేక్.. భారీ లాభాల్లోకి దూసుకెళ్లిన సెన్సెక్స్
Stock Market Today: ఐదు రోజుల నష్టాల తర్వాత స్టాక్ మార్కెట్ పుంజుకుంది. కేంద్ర బడ్జెట్ ఎఫెక్ట్ నుంచి కోలుకున్న సూచీలు భారీ లాభాల్లోకి దూసుకెళ్లాయి. లాభాల్లో ప్రారంభమైన రెండు సూచీలు రోజంతా అదే ఒరవడిని కొనసాగించాయి. ఆరంభం నుంచి కొనుగోళ్ల ఉత్సాహంతో లాభాల బాట పట్టింది.
ఇవాళ ఉదయం 80 వేల 158.50 పాయింట్ల వద్ద లాభాల్లో సెన్సెక్స్ ప్రారంభమైంది. చివరికి 12 వందల 92 పాయింట్ల లాభంతో 81 వేల 332.72 వద్ద స్థిరపడింది.న నిఫ్టీ ఇంట్రాడే 24 వేల 423.35 వద్ద లాభాల్లో ప్రారంభమై రోజంతా అదే బాటలో నడిచింది. చివరికి 428 పాయింట్ల లాభంతో 24 వేల 834 వద్ద స్థిరపడింది.