Stock Market: నష్టాల్లో ముగిసిన దేశీ ఈక్విటీ మార్కెట్లు
Stock Market: దేశీ ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి.
Stock Market: నష్టాల్లో ముగిసిన దేశీ ఈక్విటీ మార్కెట్లు
Stock Market: దేశీ ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 485 పాయింట్లు కోల్పోయి 52,568 వద్దకు చేరగా నిఫ్టీ 151 పాయింట్లు క్షీణించి 15,727 వద్ద స్థిరపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలకు తోడు బ్యాంకింగ్, మెటల్, ఫార్మా షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కోవడంతో సూచీలు నష్టాల బాటన కొనసాగాయి. ఫలితంగా క్రితం సెషన్ లో సెన్సెక్స్ 53వేల పాయింట్ల వద్ద జీవన కాల గరిష్ఠాన్ని తాకిన ఆనందం ఒక్క రోజులోనే ఆవిరయినట్లయింది. తాజా సెషన్ లో సెన్సెక్స్ 52,500 స్థాయికి చేరుకోగా నిఫ్టీ సైతం 15,750 దిగువన ముగిసింది.