5 Rupee Note: 5 రూపాయ‌ల నోటుతో రూ. 5 ల‌క్ష‌లు సొంతం చేసుకునే అవ‌కాశం.. ఎలాగంటే

5 Rupee Note: డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ పెరుగుతోన్న ఈ రోజుల్లో పాత వస్తువులకు కొత్త విలువ పెరుగుతోంది. ముఖ్యంగా పాత నోట్లకు అనూహ్యంగా డిమాండ్‌ పెరుగుతోంది. నోట్ల సేకరణకు ఆసక్తి ఉన్న కలెక్టర్ల వల్లే ఇది సాధ్యమవుతోంది.

Update: 2025-06-15 13:00 GMT

5 Rupee Note: 5 రూపాయ‌ల నోటుతో రూ. 5 ల‌క్ష‌లు సొంతం చేసుకునే అవ‌కాశం.. ఎలాగంటే

5 Rupee Note: డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ పెరుగుతోన్న ఈ రోజుల్లో పాత వస్తువులకు కొత్త విలువ పెరుగుతోంది. ముఖ్యంగా పాత నోట్లకు అనూహ్యంగా డిమాండ్‌ పెరుగుతోంది. నోట్ల సేకరణకు ఆసక్తి ఉన్న కలెక్టర్ల వల్లే ఇది సాధ్యమవుతోంది. ఈ క్రమంలో పాత రూ. 5 నోట్లు అమ్మి లక్షల్లో సంపాదించొచ్చని నిపుణులు చెబుతున్నారు.

“786” సీరియల్ నంబర్‌కు భారీ డిమాండ్

పాత ₹5 నోటులో “786” అనే సీరియల్ నంబర్ ఉంటే దానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇస్లామిక్ పరంపరలో ఈ నంబర్ పవిత్రంగా భావిస్తారు. అందువల్ల కలెక్టర్‌లు ఇలా ఉన్న నోట్లను ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తారు. ఇటువంటి నోటుకు డిమాండ్ ఎక్కువగా ఉండటంతో మార్కెట్ విలువ లక్షల వరకు వెళ్లొచ్చు.

ఇతర ప్రత్యేకతలు – ట్రాక్టర్, గాంధీ బొమ్మతో ఉన్న నోట్లు

కేవలం సీరియల్ నంబరే కాదు, గాంధీ చిత్రంతో పాటు ట్రాక్టర్ ఇమేజ్ ఉన్న నోట్లకూ ప్రీమియం విలువ లభిస్తుంది. ప్రత్యేకించి 2005కు ముందుగా ముద్రించిన‌ నోట్లు అధిక ధరలకు అమ్ముడవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ఇలా ఉన్న నోట్లకు రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు ధర పలికినట్లు నమోదైంది.

ఎక్కడ అమ్మాలి?

మీ దగ్గర ఉన్న విలువైన నోట్లను ఆన్‌లైన్‌లో అమ్మాలంటే కొన్ని నమ్మదగిన ప్లాట్‌ఫాంలను ఉపయోగించవచ్చు:

Quikr, OLX – వీటిని ఎక్కువ మంది వినియోగదారులు ఉప‌యోగిస్తుండ‌డం వ‌ల్ల త్వ‌ర‌గా అమ్ముడ‌య్యే అవ‌కాశం ఉంది.

eBay India – ఆక్షన్ స్టైల్ అమ్మకాలు జరగడం వల్ల అత్యధిక ధర పొందే ఛాన్స్ ఉంటుంది.

CoinBazzar, NumisKart – న్యూమిస్మాటిక్ స్పెషలైజ్డ్ మార్కెట్లలో నోట్లకు లక్ష్యం స్పష్టంగా ఉంటుంది.

Facebook Marketplace, WhatsApp Groups – చక్కటి కమ్యూనిటీ ద్వారా నేరుగా కొనుగోలుదారులను చేరుకోవచ్చు.

Tags:    

Similar News