Anil Ambani: అనిల్ అంబానీకి సెబీ భారీ షాక్
నిధుల మళ్లింపు వ్యవహారంలో అనిల్ అంబానీపై సెబీ చర్యలకు ఉపక్రమించింది. ఐదేళ్లపాటు స్టాక్ మార్కెట్‌లో అనిల్ అంబానీ కార్యకలాపాలపై నిషేధం విధిస్తున్నట్లు సెబీ ప్రకటించింది.
Anil Ambani: అనిల్ అంబానీకి సెబీ భారీ షాక్
Anil Ambani: పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి సెబీ షాక్ ఇచ్చింది. స్టాక్ మార్కెట్‌లో కార్యకలాపాలపై నిషేధం విధించింది సెబీ. నిధుల మళ్లింపు వ్యవహారంలో అనిల్ అంబానీపై సెబీ చర్యలకు ఉపక్రమించింది. ఐదేళ్లపాటు స్టాక్ మార్కెట్‌లో అనిల్ అంబానీ కార్యకలాపాలపై నిషేధం విధిస్తున్నట్లు సెబీ ప్రకటించింది. అనిల్‌కి చెందిన 24 సంస్థలపై నిషేధం విధించడమే కాకుండా... 25 కోట్ల రూపాయల జరిమానా విధించింది.
లిస్టెడ్ కంపెనీలో డైరెక్టర్, కీ మేనేజర్ పర్సనల్ లాంటి పదవులు దక్కకుండా ఆదేశాలు ఇచ్చింది. సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి కంపెనీ నిధుల మళ్లింపు జరగకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్‌ను సెక్యూరిటీల మార్కెట్ నుంచి బ్యాన్ చేసింది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్‌పై ఆరు నెలల పాటు నిషేధంతో పాటు రిలయన్స్ హోమ్ ఫైనాన్స్‌పై రూ. 6 లక్షల జరిమానా విధించింది.