ఎస్‌బీఐ భారీ శుభవార్త.. ఇకనుంచి డెబిట్‌ కార్డులపై కూడా..

ఎస్‌బీఐ భారీ శుభవార్త.. ఇకనుంచి డెబిట్‌ కార్డులపై కూడా.. ఎస్‌బీఐ భారీ శుభవార్త.. ఇకనుంచి డెబిట్‌ కార్డులపై కూడా..

Update: 2019-10-07 09:47 GMT

డెబిట్‌ కార్డు కస్టమర్లకు ఎస్‌బీఐ భారీ శుభవార్త అందించింది. ఇకనుంచి డెబిట్‌ కార్డుపైనా కూడా ఈఎంఐ సౌకర్యం కల్పించనున్నట్లు ఎస్‌బీఐ తెలిపింది. ఈ మ్రాకు సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. దేశవ్యాప్తంగా 40,000కుపైగా వాణిజ్య సముదాయాలు, వ్యాపార సంస్ధల వద్ద ఏర్పాటు చేసిన పాయింట్‌ ఆఫ్‌ సేల్స్‌ (పీఓఎస్‌) వద్ద ఎస్‌బీఐ డెబిట్‌కార్డుదారులు వస్తువులను కొనుగోలు చేసినచో ఆ మొత్తం ఈఎంఐ రూపంలో చెల్లించుకోవచ్చని ఎస్‌బీఐ ఛైర్మన్‌ రజనీష్‌ కుమార్‌ వెల్లడించారు. ఇందుకోసం ఎలాంటి ప్రాసెసింగ్‌, డాక్యుమెంటేషన్‌ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. అంతేకాదు సేవింగ్స్‌ ఖాతాలో అకౌంట్‌ బ్యాలెన్స్‌తో సంబంధం లేకుండా ఒక్క నిమిషంలోనే ఈ సదుపాయం పొందవచ్చని తెలిపారు.

వస్తువుల అవసరం ఉండి.. అంతమొత్తంలో డబ్బు లేని కస్టమర్లకు డెబిట్‌ కార్డుల ఈఎంఐపై అవకాశం కల్పించినట్లు ఆయన స్పష్టం చేశారు. కనిష్టంగా ఆరు నెలల నుంచి 18 నెలల వరకూ వినియోగదారులు ఈఎంఐ గడువును ఎంపిక చేసుకోవచ్చని ఎస్‌బీఐ పేర్కొంది. కాగా వస్తువు కొనుగోలు పూర్తయిన నెల తర్వాత ఈఎంఐలు మొదలవుతాయి. ఇందుకోసం క్రెడిట్‌ హిస్టరీ పాజిటివ్ గా ఉండాలి. ఈఎంఐ అర్హతను చెక్‌ చేసుకునేందుకు డీసీఈఎంఐ అని టైప్‌ చేసి 567676 నెంబర్‌కు ఎస్‌ఎంఎస్‌ చేయాలని ఎస్‌బీఐ తెలిపింది. మరోవైపు ఈ సదుపాయం పూర్తిస్థాయిలో మరో వారంరోజుల్లోపు అందుబాటులోకి రానుంది. 

Tags:    

Similar News