LIC New Policy: రూ.45 పెట్టుబడితో రూ.25 లక్షల ప్రయోజనం.. కళ్లు చెదిరే లాభాలిచ్చే ఎల్ఐసీ పాలసీ.. అదేంటో తెలుసా?

LIC Jeevan Anand: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) దేశ ప్రజల కోసం ఎన్నో పాలసీలను అందిస్తోంది.ఇందులో చిన్న పిల్లల నుంచి సీనియర్ సిటిజన్స్ వరకు ఎన్నో పథకాలు అందుబాటులో ఉన్నాయి.

Update: 2023-06-06 08:30 GMT

LIC New Policy: రూ.45 పెట్టుబడితో రూ.25 లక్షల ప్రయోజనం.. కళ్లు చెదిరే లాభాలిచ్చే ఎల్ఐసీ పాలసీ.. అదేంటో తెలుసా?

LIC Jeevan Anand: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) దేశ ప్రజల కోసం ఎన్నో పాలసీలను అందిస్తోంది. ఇందులో చిన్న పిల్లల నుంచి సీనియర్ సిటిజన్స్ వరకు ఎన్నో పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఎల్ఐసీ పాలసీల్లో అద్భుతమైన పథకాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.. ఎల్ఐసీ న్యూ జీవన్ ఆనంద్ పాలసీ. న్యూ జీవన్ ఆనంద్ పాలసీ ముఖ్యంగా సేవింగ్‌తోపాటు భద్రతకు కూడా పేరుగాంచింది. అందుకే దీనిని హోల్ లైఫ్ ఎండోమెంట్ ప్లాన్‌గా చెబుతుంటారు. న్యూ జీవన్ ఆనంద్ పాలసీలో సేవింగ్ చేయడం ద్వారా హామీతో కూడిన లాభాలను అందిస్తుంది. అలాగే ప్రీమియం ఎంచుకునే ఛాన్స్ కూడా వినియోగదారులకు అందుబాటులో ఉంది. పాలసీ ముగిసిన తర్వాత మెచ్యూరిటీ మొత్తం దక్కుతుంది. అలాగే పాలసీదారు చనిపోయిన తర్వాత పాలసీ మొత్తం అందుతుంది. ఈ జీవన్ ఆనంద్ పాలసీ అందించే ఇతర ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మెచ్యూరిటీ లాభాలు..

పాలసీ టర్మ్ ముగిసిన తర్వాత పాలసీదారుడు జీవించి ఉంటే మెచ్యూరిటీపై హామీ మొత్తాన్ని అందుకోవచ్చు.

డెత్ బెనిఫిట్..

పాలసీదారుడు చనిపోయిన సమయంలో నామీనికి ముందుగా నిర్ణయించిన సొమ్ము అందజేస్తారు. దీంతో వారి కుటుంబం ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉంటుంది.

ఎల్‌ఐసీ లాభాల్లో కొంత వాటా..

న్యూ జీవన్ ఆనంద్ పాలసీలో పెట్టుబడి పెట్టడం వల్ల ఎల్ఐసీలో వచ్చే ప్రాఫిట్స్‌ను అందుకునే ఛాన్స్ ఉంటుంది.

ట్యాక్స్ మినహాయింపు..

న్యూ జీవన్ ఆనంద్ పాలసీలో పెట్టుబడితో ట్యాక్స్ మినహాయింపు కూడా లభిస్తుంది.

రూ.25 లక్షల రాబడి కేవలం రూ. 45ల పెట్టబడితో..

ఎల్‌ఐసీ న్యూ జీవన్ ఆనంద్ పాలసీలో కనీసం రూ. 5 లక్షల హామీని పొందే ఛాన్స్ ఉంది. అంటే 35 సంవత్సరాల్లో రూ.25 లక్షలు దక్కించుకునే ఛాన్స్ ఉంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.. సంవత్సరానికి రూ. 16,300లు లేదా నెలకు రూ. 1,358 చొప్పున 35 ఏళ్లలో రూ. 25 లక్షల మెచ్యూరిటీ అందుకోవచ్చు. అంటే రోజుకు రూ. 45ల పెట్టుబడితో ఇంత భారీ మొత్తాన్ని దక్కించుకోవచ్చు.

Tags:    

Similar News