RIL AGM 2025: రిలయన్స్ ఏజీఎంలో సంచలన ప్రకటనలు – జియో పీసీ, జియో ఫ్రేమ్స్, హాట్‌స్టార్‌లో కొత్త ఏఐ ఫీచర్లు
రిలయన్స్ వార్షిక సాధారణ సమావేశం (RIL AGM)లో ఈసారి కూడా పలు కీలక ప్రకటనలు వెలువడ్డాయి. ముకేశ్ అంబానీ తనయుడు ఆకాశ్ అంబానీ జియో నుంచి రాబోయే కొత్త ఉత్పత్తులు, సేవలను వివరించారు.

జియో పీసీ
టీవీని సులభంగా పర్సనల్ కంప్యూటర్‌గా మార్చుకునే జియో పీసీని ఆవిష్కరించారు. కేవలం కీబోర్డు, జియో సెటాప్‌బాక్స్ కనెక్ట్ చేస్తే చాలు – టీవీ వర్చువల్ పీసీగా మారిపోతుంది. ఇది క్లౌడ్ ఆధారంగా పనిచేస్తుంది కాబట్టి ఎప్పుడూ అప్‌డేట్‌గా ఉంటుంది. మెమరీ, స్టోరేజ్, కంప్యూటింగ్ పవర్‌ను అవసరానికి అనుగుణంగా పెంచుకునే అవకాశం ఉంటుంది.
జియో ఫ్రేమ్స్
ఈ వేదికపై జియో ఫ్రేమ్స్ పేరుతో స్మార్ట్ గ్లాసెస్‌ను కూడా పరిచయం చేశారు. వీటితో కాల్స్ చేయవచ్చు, ఫొటోలు తీయవచ్చు, అలాగే ఇయర్‌ఫోన్స్ అవసరం లేకుండానే మ్యూజిక్ వినొచ్చు. ఇందులో బిల్ట్-ఇన్ జియో వాయిస్ ఏఐ ఉంటుంది. అన్ని భారతీయ భాషలకు సపోర్ట్ చేసే ఈ గ్లాసెస్ ధరను ఇంకా ప్రకటించలేదు.
జియో హాట్‌స్టార్‌లో కొత్త ఏఐ ఫీచర్లు
రిలయన్స్–డిస్నీ సంయుక్తంగా నడుపుతున్న జియో హాట్‌స్టార్ ఇప్పుడు దేశంలో రెండో అతిపెద్ద వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌గా ఉన్నట్లు ఆకాశ్ అంబానీ వెల్లడించారు. కొత్తగా “రియా” అనే ఏఐ అసిస్టెంట్‌ను జోడించారు. ఇది వాయిస్ కమాండ్స్‌తో కంటెంట్ వెతికే సౌకర్యం ఇస్తుంది. అలాగే “వాయిస్ ప్రింట్” అనే టూల్‌తో వాయిస్ క్లోనింగ్, లిప్‌సింక్ టెక్నాలజీ సాయంతో నటులు, క్రీడాకారుల మాటలు మీకు నచ్చిన భారతీయ భాషలో వినొచ్చు. అదనంగా మ్యాక్స్‌వ్యూ 3.0ను కూడా ప్రదర్శించారు.
రాబోయే జియో IPO
తదుపరి ఏడాదిలో జియో ఐపీఓ మార్కెట్లోకి వస్తుందని కూడా ఈ సందర్భంగా ప్రకటించారు.