Petrol Prices: దేశ ప్రజలకు గుడ్‌న్యూస్ చెప్పనున్న ప్రధాని మోడీ.. రూ. 10 తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. ఎప్పుడంటే?

Petrol Diesel Price Cut News: కొత్త సంవత్సరం సందర్భంగా మోడీ ప్రభుత్వం దేశ ప్రజలకు పెద్ద ఊరటని ఇవ్వబోతోంది.

Update: 2023-12-29 06:35 GMT

Petrol Prices: దేశ ప్రజలకు గుడ్‌న్యూస్ చెప్పనున్న ప్రధాని మోడీ.. రూ. 10 తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. ఎప్పుడంటే?

Petrol Diesel Price Cut News: కొత్త సంవత్సరం సందర్భంగా మోడీ ప్రభుత్వం దేశ ప్రజలకు పెద్ద ఊరటని ఇవ్వబోతోంది. పెట్రోలు, డీజిల్ ధరలను ప్రభుత్వం భారీగా తగ్గించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. పెట్రోలు, డీజిల్ ధరల్లో ప్రభుత్వం రూ.10 వరకు తగ్గించే అవకాశం ఉందంట. జీ బిజినెస్ రిపోర్ట్ ప్రకారం.. ఈ విషయాన్ని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. చాలా కాలంగా పెట్రోలు, డీజిల్ ధరల్లో పెరుగుదల లేని సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రభుత్వం ముడి చమురు ధర తగ్గింపు ప్రయోజనాన్ని ప్రజలకు అందించబోతోంది.

త్వరలో ప్రకటించనున్న ప్రధాని మోదీ..

పెట్రోలు, డీజిల్ ధరలను లీటరుకు రూ.8-10 తగ్గించే ప్రతిపాదనను పెట్రోలియం మంత్రిత్వ శాఖ సిద్ధం చేసినట్లు జీ బిజినెస్ పేర్కొంది. దీనిపై ప్రధాని ఆమోదం పెండింగ్‌లో ఉందంట. దీనిపై ఎప్పుడైనా నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. క్యాలెండర్ ఇయర్ ముగిసేలోపు ఈ విషయాన్ని ప్రకటించవచ్చని వార్తలు వస్తున్నాయి.

పెట్రోలియం మంత్రిత్వ శాఖ వాదన?

దిగుమతి చేసుకున్న ముడి చమురు కొనుగోలు ధరలో భారీ తగ్గుదల చోటు చేసుకుందని పెట్రోలియం మంత్రిత్వ శాఖ వాదిస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్-మార్చి) ఇప్పటివరకు ముడి చమురు ధరలు బ్యారెల్‌కు సగటున $77.14గా ఉన్నాయి. కేవలం రెండు నెలల్లో పెరుగుదల - సెప్టెంబర్‌లో $93.54, అక్టోబర్‌లో $90.08గా ఉంది. 2022-23లో ముడి చమురు సగటు ధర బ్యారెల్‌కు $ 93.15లకు చేరుకుంది.

పెట్రోల్, డీజిల్ ధర ఎక్కడ ఉంది?

దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం పెట్రోల్ రూ.96.65కు లభిస్తుండగా, డీజిల్ లీటరుకు రూ.89.82గా ఉంది. కోల్‌కతాలో లీటరు పెట్రోల్ ధర రూ.106.03, డీజిల్ ధర రూ.92.76గా ఉంది. ముంబై గురించి చెప్పాలంటే, ఇక్కడ పెట్రోల్ ధర రూ. 106.31, డీజిల్ ధర లీటరుకు రూ. 94.27. మరోవైపు హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.109.66లు ఉండగా, డీజిల్ ధర రూ.97.82లు ఉంది.

Tags:    

Similar News