PM Kisan: రైతులకి అలర్ట్‌.. మరో 20 రోజుల్లో 12వ విడత డబ్బులు..!

PM Kisan: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి రూ.2000 చొప్పున మూడు విడతల్లో అందిస్తోంది.

Update: 2022-08-12 11:30 GMT

PM Kisan: రైతులకి అలర్ట్‌.. మరో 20 రోజుల్లో 12వ విడత డబ్బులు..!

PM Kisan: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి రూ.2000 చొప్పున మూడు విడతల్లో అందిస్తోంది. మీరు కూడా 12వ విడత కోసం ఎదురుచూస్తున్నట్లయితే ఇది మీకు శుభవార్త అవుతుంది. ఎందుకంటే పీఎం కిసాన్ 12వ విడత సెప్టెంబర్ 1, 2022న రైతుల ఖాతాకు బదిలీ అవుతుంది. పీఎం కిసాన్ పథకం కింద ఏప్రిల్ 1 నుంచి జూలై 31 మధ్య కాలంలో రైతులకు మొదటి విడత డబ్బు అందుతుంది.

అదే సమయంలో రెండో విడత డబ్బు ఆగస్టు 1 నుంచి నవంబర్ 30 మధ్య బదిలీ అవుతుంది. ఇది కాకుండా మూడో విడత డబ్బు డిసెంబర్ 1 నుంచి మార్చి 31 మధ్య బదిలీ అవుతుంది. ఈసారి పీఎం కిసాన్ యోజన 11వ విడత డబ్బును 31 మే, 2022న సిమ్లాలో పీఎం మోడీ బదిలీ చేశారు. ఇప్పుడు రెండో విడత డబ్బు 1 సెప్టెంబర్ 2022న రైతుల ఖాతాకు బదిలీ అవుతుందని సమాచారం.

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద అర్హులైన రైతు కుటుంబాలకు ప్రతి సంవత్సరం రూ.6,000 ఆర్థిక సహాయం అందజేస్తారు. ఈ మొత్తాన్ని ఒక్కొక్కరికి రెండు వేల చొప్పున మూడు సమాన విడతలుగా రైతుల ఖాతాలకు బదిలీ చేస్తారు. ఈ వాయిదాలు ప్రతి నాలుగు నెలలకు అందుతాయి. అంటే సంవత్సరానికి మూడుసార్లు పథకం కింద రైతుల ఖాతాకు 2000-2000 రూపాయలు అందుతాయి.

ఈ సొమ్మును కేంద్ర ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాలో జమ చేస్తుంది. ఇప్పటి వరకు 11 విడతలుగా ఒక్కొక్కరికి రూ.2 వేల చొప్పున రైతుల ఖాతాల్లోకి జమ చేశారు. పీఎం కిసాన్ కింద ఏటా రూ.6,000 తీసుకునే అర్హత లేని అనేక రైతు కుటుంబాలు ఉన్నాయి. పీఎం కిసాన్ వెబ్‌సైట్ ప్రకారం పీఎం కిసాన్ యోజన ప్రయోజనాన్ని పొందలేని అనేక వర్గాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆర్థికంగా సంపన్నులైన వ్యక్తులు దీనికి అర్హులు కాదు.

Tags:    

Similar News