PM Kisan: రైతులకు గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ 14వ విడత వచ్చేది ఆ తేదీనే..!

PM Kisan 14th Installment Date: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM KISAN) అనేది రైతుల ఆర్థిక సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ముఖ్యమైన పథకం. ఈ పథకం కింద ప్రభుత్వం అర్హులైన రైతులకు ప్రతి నాలుగు నెలలకు రూ.2000లు ఇస్తుంది.

Update: 2023-05-13 06:12 GMT

PM Kisan: రైతులకు గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ 14వ విడత వచ్చేది ఆ తేదీనే..!

PM Kisan 14th Installment Date: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM KISAN) అనేది రైతుల ఆర్థిక సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ముఖ్యమైన పథకం. ఈ పథకం కింద ప్రభుత్వం అర్హులైన రైతులకు ప్రతి నాలుగు నెలలకు రూ.2000లు ఇస్తుంది. ఈ సొమ్ము డీబీటీ ద్వారా రైతుల బ్యాంకు ఖాతాలకు చేరుతుంది. రైతులు పీఎం కిసాన్ 13వ విడత ఇప్పటికే పొందారు. ఇప్పుడు దేశంలోని కోట్లాది మంది రైతులు 14వ విడత కోసం ఎదురుచూస్తున్నారు.

ఏడాదిలో మూడు వాయిదాల్లో డబ్బులు..

ఈ పథకం కింద రైతులకు ఏడాదిలో మూడు విడతల్లో డబ్బులు అందుతాయి. కొత్త ఆర్థిక సంవత్సరం తొలి విడతను ప్రభుత్వం త్వరలో విడుదల చేయనుంది. సాధారణంగా, ఆర్థిక సంవత్సరంలో మొదటి విడత ఏప్రిల్ నుంచి జూలై మధ్య, రెండవది ఆగస్టు నుంచి నవంబర్ మధ్య, మూడవది డిసెంబర్ నుంచి మార్చి మధ్య ఇస్తున్నారు. ఒక రైతు ఖాతా DBT లేదా NPCIకి లింక్ చేయకపోతే, వీలైనంత త్వరగా పూర్తి చేసుకోవాలి.

ప్రభుత్వం విడుదల చేసే PM కిసాన్ 14వ విడత కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఇప్పుడు గుడ్ న్యూస్ అందనుంది. జూన్ మొదటి వారంలో 14 వ విడత డబ్బులు అందనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈసారి 14వ విడత ఏప్రిల్ 2023, జులై 2023 మధ్య విడుదల కానుంది. ఈ విడత మే చివరి వారం లేదా జూన్ మొదటి వారంలో విడుదలయ్యే అవకాశం ఉందని వ్యవసాయ మంత్రిత్వ శాఖకు సంబంధించిన వర్గాలు పేర్కొంటున్నాయి. అంతకుముందు, 13వ విడత కూడా 26 ఫిబ్రవరి 2023న విడుదలైంది. పీఎం కిసాన్ ప్రయోజనం పొందడానికి, ఇ-కెవైసిని పూర్తి చేయడం తప్పనిసరి.

లబ్ధిదారుల జాబితాను ఎలా తనిఖీ చేయాలి..

- ముందుగా PM కిసాన్ పోర్టల్‌కి వెళ్లాలి. ఇక్కడ బెనిఫిషియరీ లిస్ట్'పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత రాష్ట్రం, జిల్లా, తహసీల్, బ్లాక్, గ్రామం ఎంచుకోవాలి. నివేదికను పొందడానికి ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.

eKYC ఆన్‌లైన్‌లో ఎలా అప్‌డేట్ చేయాలంటే..

- PM-KISAN అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

ఇక్కడ కుడివైపున ఇచ్చిన EKYC ఎంపికపై క్లిక్ చేయాలి.

ఇక్కడ ఆధార్ కార్డ్ నంబర్, క్యాప్చా కోడ్‌ను నమోదు చేయండి. ఆ తర్వాత ఆధార్ కార్డుకు లింక్ చేసిన మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి. OTP కోసం క్లిక్ చేసి, తర్వాత OTPని నమోదు చేయాలి.

Tags:    

Similar News