Petrol Price Today 05-11-2019: ఐదో రోజూ తగ్గిన పెట్రోల్! స్థిరంగా డీజిల్!!

వరుసగా ఐదో రోజూ పెట్రోల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. డీజిలు ధరలు మాత్రం స్థిరంగా నిలిచాయి.

Update: 2019-11-05 02:35 GMT

నాలుగు రోజులుగా స్వల్పంగా తగ్గుతూ వస్తున్న పెట్రోల్ ధరలు ఈరోజు కుడా తగ్గాయి. ఇక డీజిల్ ధరలు మాత్రం ఎటువంటి మార్పూలేకుండా స్థిరంగా ఉన్నాయి. 05-11-2019 మంగళవారం  పెట్రోల్ ధరలు దిగివచ్చాయి. హైదరాబాద్ లో లీటరు పెట్రోల్ ధర 5 పైసలు తగ్గి 77.26 రూపాయల వద్ద నిలిచింది. ఇక డీజిల్ ధర స్థిరంగా 71.75 రూపాయల వద్ద ఉంది. అటు అమరావతిలోనూ ఇదే పరిస్థితి వుంది. ఇక్కడా పెట్రోల్ ధర 5 పైసలు తగ్గి 76. 89 రూపాయలు గానూ, డీజిల్ ధర మార్పులు లేకుండా  71.06 రూపాయలు గాను ఉన్నాయి. ఇక విజయవాడలో కూడా పెట్రోల్ ధర 5 పైసలు తగ్గగా , డీజిల్ ధర స్థిరంగా ఉంది. దీంతో అక్కడ పెట్రోల్ ధర లీటరు 76.53 రూపాయలుగానూ, డీజిల్ ధర లీటరు 70.72 రూపాయలుగానూ నిలిచాయి.

ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇదే పరిస్థితి ఉంది. అక్కడ పెట్రోల్ ధర లీటరుకు 5 పైసలు తగుదల నమోదు చేయగా, డీజిలు యధాతథంగా ఉంది. దీంతో, పెట్రోలు ధర 72.60 రూపాయలుగానూ, డీజిల్ ధర 65.75 రూపాయలుగానూ ఉన్నాయి. వాణిజ్య రాజధాని ముంబయిలోను ఇలాగే ఉంది. అక్కడ పెట్రోల్ లీటరుకు 5 పైసలు ద్గివచ్చింది. డీజిల్ నిలకడగా ఉంది. దీంతో, పెట్రోల్ 78.28 రూపాయలుగానూ, డీజిల్ ధర లీటరుకు 68.96 రూపాయలుగానూ ఉన్నాయి.

పెట్రోల్ డీజిల్ ధరలు ప్రతిరోజూ ఉదయం ఆరు గంటలకు మారుతుంటాయి. ఈ విధానం రెండేళ్లుగా అమలులోకి వచ్చింది. ప్రతి ఉదయం ముఖ్య నగరాల్లో ప్రకటించిన పెట్రోల్ ధరలు ఇక్కడ ఇవ్వడం జరుగుతోంది. 


Tags:    

Similar News