Petrol Price Today 04-11-2019: వరుసగా నాలుగోరోజూ తగ్గిన పెట్రోల్ ధర!

మూడు రోజులుగా స్వల్పంగా తగ్గుతూ వస్తున్న పెట్రోల్ ధరలు ఈరోజు కుడా తగ్గాయి. ఇక డీజిల్ ధరలు కూడా అదే దారిలో ఉన్నాయి.

Update: 2019-11-04 03:44 GMT

మూడు రోజులుగా స్వల్పంగా తగ్గుతూ వస్తున్న పెట్రోల్ ధరలు ఈరోజు కుడా తగ్గాయి. ఇక డీజిల్ ధరలు కూడా అదే దారిలో ఉన్నాయి. 04-11-2019 సోమవారం పెట్రోల్ ధరలు దిగివచ్చాయి. హైదరాబాద్ లో లీటరు పెట్రోల్ ధర10 పైసలు తగ్గి 77.31 రూపాయల వద్ద నిలిచింది. ఇక డీజిల్ ధర 3 పైసలు తగ్గి  71.75 రూపాయల వద్ద చేరింది.

అటు అమరావతిలోనూ ఇదే పరిస్థితి వుంది. ఇక్కడా పెట్రోల్ ధర 10 పైసలు తగ్గి 76. 94 రూపాయలు గానూ, డీజిల్ ధర 3 పైసలు తగ్గి 71.06 రూపాయలు గాను ఉన్నాయి. ఇక విజయవాడలో కూడా పెట్రోల్ ధర 9 పైసలు తగ్గగా , డీజిల్ ధర 3 పైసలు తగ్గింది. దీంతో అక్కడ పెట్రోల్ ధర లీటరు 76.58 రూపాయలుగానూ, డీజిల్ ధర లీటరు 70.72 రూపాయలుగానూ నిలిచాయి.

ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇదే పరిస్థితి ఉంది. అక్కడ పెట్రోల్ ధర లీటరుకు 9 పైసలు తగుదల నమోదు చేయగా, డీజిలు 5 పైసలు తగ్గింది. దీంతో, పెట్రోలు ధర 72.65 రూపాయలుగానూ, డీజిల్ ధర 65.75 రూపాయలుగానూ ఉన్నాయి. వాణిజ్య రాజధాని ముంబయిలోను ఇలాగే ఉంది. అక్కడ పెట్రోల్ లీటరుకు 9 పైసలు ద్గివచ్చింది. డీజిల్ 3 పైసలు తగ్గింది. దీంతో, పెట్రోల్ 78.33 రూపాయలుగానూ, డీజిల్ ధర లీటరుకు 68.96 రూపాయలుగానూ ఉన్నాయి.

పెట్రోల్ డీజిల్ ధరలు ప్రతిరోజూ ఉదయం ఆరు గంటలకు మారుతుంటాయి. ఈ విధానం రెండేళ్లుగా అమలులోకి వచ్చింది. ప్రతి ఉదయం ముఖ్య నగరాల్లో ప్రకటించిన పెట్రోల్ ధరలు ఇక్కడ ఇవ్వడం జరుగుతోంది


Tags:    

Similar News