Paytm Travel Deals: పేటీఎంలో భారీ డిస్కౌంట్లు..!

రాఖీ, శ్రీకృష్ణ జన్మాష్టమి వంటి పండుగల సందర్భంగా పేటీఎం (వన్ 97 కమ్యూనికేషన్స్) ట్రావెల్ మెగా ఫెస్టివల్ సేల్‌ను ప్రారంభించింది. ఈ సందర్భంగా ప్రయాణికుల కోసం పలు ఆకర్షణీయమైన డిస్కౌంట్ ఆఫర్లు అందిస్తోంది.

Update: 2025-07-31 13:01 GMT

Paytm Travel Deals: పేటీఎంలో భారీ డిస్కౌంట్లు..!

రాఖీ, శ్రీకృష్ణ జన్మాష్టమి వంటి పండుగల సందర్భంగా పేటీఎం (వన్ 97 కమ్యూనికేషన్స్) ట్రావెల్ మెగా ఫెస్టివల్ సేల్‌ను ప్రారంభించింది. ఈ సందర్భంగా ప్రయాణికుల కోసం పలు ఆకర్షణీయమైన డిస్కౌంట్ ఆఫర్లు అందిస్తోంది.

దేశీయ విమాన టికెట్లపై 12% వరకు, అంతర్జాతీయ విమాన సేవలపై 10% వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే బస్ బుకింగ్స్ పై అత్యధికంగా 20% తగ్గింపు అందిస్తోంది. పేటీఎం యాప్ ద్వారా యూపీఐ పేమెంట్‌ చేసిన రైలు బుకింగ్స్‌కి ఎలాంటి గేట్‌వే ఛార్జీలు ఉండవు.

అంతేకాకుండా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐసీఐసీఐ బ్యాంక్, ఆర్‌బీఎల్ బ్యాంక్ క్రెడిట్ కార్డుదారులు అదనపు రాయితీలను పొందవచ్చు. పేటీఎం ద్వారా రైలు టికెట్లు బుక్ చేసుకుని క్యాన్సిల్ చేస్తే 100% తక్షణ రీఫండ్‌తో పాటు ఉచిత క్యాన్సిలేషన్ సదుపాయం కూడా అందుబాటులో ఉంది. ఈ ప్రయోజనాలు జూలై 31 వరకు అందుబాటులో ఉంటాయని సంస్థ పేర్కొంది.

Tags:    

Similar News