జన్ ధన్ ఖాతాదారులకి గమనిక.. 10వేల రూపాయల కోసం ఇలా అప్లై చేయండి..!

Jan Dhan Yojana: ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన కింద దేశంలోని 47 కోట్ల మంది ప్రజలు ఖాతాలు తెరిచారు.

Update: 2023-01-24 05:10 GMT

జన్ ధన్ ఖాతాదారులకి గమనిక.. 10వేల రూపాయల కోసం ఇలా అప్లై చేయండి..!

Jan Dhan Yojana: ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన కింద దేశంలోని 47 కోట్ల మంది ప్రజలు ఖాతాలు తెరిచారు. ఈ ఖాతాదారులందరికి ఓవర్‌ డ్రాఫ్ట్‌ కింద రూ.10,000 నగదు బదిలీ చేస్తున్నారు. ఇందుకోసం బ్యాంకులో దరఖాస్తు చేసుకోవాలి. ఇది కాకుండా ఖాతాదారులకు రూ.1 లక్ష 30 వేల బీమా లభిస్తుంది. మీకు ఇంకా రూ.10,000 రాకపోతే ఈ విధంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

1 లక్ష 30 వేల రూపాయలు

జన్ ధన్ ఖాతా తెరవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఖాతాదారులకు బ్యాంకు ద్వారా అనేక సౌకర్యాలు కల్పిస్తారు. ఇందులో ఖాతాదారునికి రూ.లక్ష ప్రమాద బీమా ఉంటుంది. ఇది కాకుండా 30 వేల జీవిత బీమా కూడా వర్తిస్తుంది. జన్ ధన్ ఖాతాదారు ప్రమాదంలో మరణిస్తే నామినీకి రూ.1 లక్ష బీమా అందుతుంది. సాధారణ పరిస్థితుల్లో మరణించిన వారికి రూ.30,000 అందజేస్తారు.

జన్ ధన్ ఖాతాను ఇలా తెరవవచ్చు

మీరు బ్యాంకు నుంచి 10 వేల రూపాయలు పొందాలనుకుంటే మీ పేరు మీద జన్ ధన్ ఖాతా ఉండాలి. మీరు ఈ ఖాతాను తెరవకపోతే బ్యాంకుకు వెళ్లి ఈ ఖాతాను తెరవవచ్చు. ఈ ఖాతాను తెరిచే ప్రక్రియ చాలా సులభం. ఆధార్ కార్డు, పాన్ కార్డు ఆధారంగా ఈ ఖాతాలను తెరవవచ్చు.

10 వేల రూపాయలు

జన్ ధన్ ఖాతాలో ప్రభుత్వం తరపున రూ.10,000 ఖాతాదారులకు బదిలీ అవుతుంది. ఈ మొత్తాన్ని పొందడానికి మీరు సులభమైన ప్రక్రియ ద్వారా వెళ్ళాలి. ఇంతకుముందు ప్రభుత్వం ఈ ఖాతాలపై రూ.5,000 ఓవర్‌డ్రాఫ్ట్ ఇచ్చేది. ఇప్పుడు ఈ ఖాతాలపై రూ.10,000 ఓవర్‌డ్రాఫ్ట్ ఇస్తుంది. ఈ ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ ఉంచాలనే టెన్షన్ ఉండదు. ఇందులో మీకు రూపే డెబిట్ కార్డ్ కూడా ఇస్తారు.

Tags:    

Similar News