IndiGo Shares: ఇండిగో సంక్షోభం భారీగా పతనమైన ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ షేర్లు

వైమానిక సేవల సంస్థ ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ (InterGlobe Aviation Ltd) షేర్లు స్టాక్ మార్కెట్‌లో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.

Update: 2025-12-08 06:18 GMT

IndiGo Shares: ఇండిగో సంక్షోభం భారీగా పతనమైన ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ షేర్లు

వైమానిక సేవల సంస్థ ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ (InterGlobe Aviation Ltd) షేర్లు స్టాక్ మార్కెట్‌లో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. గత ఐదు ట్రేడింగ్ సెషన్లలోనే కంపెనీ షేరు ధర 9% కంటే ఎక్కువగా పతనమైంది. సోమవారం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే షేర్లు ఒక్కసారిగా 7% వరకు పడిపోయాయి. అనంతరం కొంచెం కోలుకున్నప్పటికీ, ఉదయం 10 గంటల సమయంలో కూడా 3.92% (రూ.210.50) నష్టంతో రూ.5,160 వద్ద ట్రేడయ్యాయి.

900 పైలట్ల సమస్య.. డీజీసీఏ నియమాలపై అవాంతరాలు

డీజీసీఏ ప్రవేశపెట్టిన కొత్త FDTL (Flight Duty Time Limit) నిబంధనలకు అనుగుణంగా సిబ్బందిని సిద్ధం చేయడంలో ఇండిగో విఫలమైంది. దీనివల్ల గత కొన్ని రోజులుగా సంస్థకు చెందిన వందల సంఖ్యలో విమానాలు రద్దయ్యాయి, అనేక ఫ్లైట్లు తీవ్రంగా ఆలస్యమయ్యాయి. అయితే, పరిస్థితి కొంత మెరుగుపడుతూ సోమవారం నుంచి కార్యకలాపాలు మెల్లగా సాధారణ స్థితికి చేరుకుంటున్నట్లు తెలుస్తోంది. సోమవారం ఒక్కరోజే ఇండిగో 1,650 విమానాలు నడిపింది.

ప్రభుత్వ సమాచారం: ప్రయాణికులకు 610 కోట్లు రీఫండ్

విమానాల రద్దు–ఆలస్యాల నేపథ్యంలో ప్రయాణికులకు ఇంతవరకు రూ.610 కోట్లు రీఫండ్ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. అదనంగా 3,000 బ్యాగేజీలను ప్రయాణికులకు తిరిగి అందించినట్లు కూడా తెలిపింది.

Tags:    

Similar News