Jio Smart Inverter: కరెంటు కష్టాలకు చెక్.. మార్కెట్లోకి జియో 'స్మార్ట్' ఇన్వర్టర్లు
Jio Smart Inverter: కటెలికాం రంగంలో ఉచితం అనే మంత్రంతో అడుగుపెట్టి, డేటా వాడకాన్ని సామాన్యుడికి చేరువ చేసిన రిలయన్స్ జియో, ఇప్పుడు మరో సంచలనానికి తెరలేపుతోంది.
Jio Smart Inverter: కరెంటు కష్టాలకు చెక్.. మార్కెట్లోకి జియో 'స్మార్ట్' ఇన్వర్టర్లు
టెలికాం రంగంలో ఉచితం అనే మంత్రంతో అడుగుపెట్టి, డేటా వాడకాన్ని సామాన్యుడికి చేరువ చేసిన రిలయన్స్ జియో, ఇప్పుడు మరో సంచలనానికి తెరలేపుతోంది. వేసవి కాలం వస్తుందంటే చాలు.. కరెంటు కోతలు, ఉక్కపోతతో జనం అల్లాడిపోతుంటారు. ఈ సమస్యకు చెక్ పెడుతూ, మధ్యతరగతి ప్రజల బడ్జెట్‌కు తగినట్లుగా "జియో స్మార్ట్ ఇన్వర్టర్ హోమ్ సిస్టమ్"ను తీసుకురావడానికి ముఖేష్ అంబానీ ప్లాన్ చేస్తున్నారు.
ప్రస్తుతం మార్కెట్‌లో బ్రాండెడ్ ఇన్వర్టర్లు, బ్యాటరీలతో కలిపి కొనాలంటే సుమారు ₹20,000 నుండి ₹30,000 వరకు ఖర్చవుతుంది. కానీ, జియో తనదైన శైలిలో షాకింగ్ ధరలతో రాబోతున్నట్లు సమాచారం: జియో స్మార్ట్ ఇన్వర్టర్లు కేవలం రూ.5,000 నుండి రూ.9,000 మధ్యలో లభించే అవకాశం ఉందట. ఇదే జరిగితే సామాన్యులకు ఇది పండగే. కేవలం విద్యుత్‌తోనే కాకుండా, సోలార్ ప్యానల్ సొల్యూషన్స్ ద్వారా కూడా చార్జ్ అయ్యేలా దీనిని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
జియో పేరులోనే స్మార్ట్‌నెస్ ఉంటుంది. కాబట్టి, ఈ ఇన్వర్టర్లను మొబైల్ యాప్ ద్వారా నియంత్రించడం లేదా పవర్ వినియోగాన్ని ట్రాక్ చేసే ఫీచర్లు ఉండవచ్చని అంచనా. ఇంట్లోని ఫ్యాన్లు, లైట్లు, టీవీ వంటి కనీస అవసరాలకు 24 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ అందించేలా దీనిని డిజైన్ చేస్తున్నారట.
జియో నెట్‌వర్క్ ఎలాగైతే ఎయిర్‌టెల్, వొడాఫోన్ వంటి కంపెనీలకు సవాల్ విసిరిందో, ఇప్పుడు లూమినస్, మైక్రోటెక్, ఎక్సైడ్ వంటి ఇన్వర్టర్ దిగ్గజాలకు జియో రూపంలో గట్టి పోటీ ఎదురుకానుంది. తక్కువ ధరకే నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా జియో ఈ రంగంలోకి అడుగుపెడుతోంది.
గాలి, వెలుతురుతో పాటు కరెంటు కూడా మనిషికి ప్రాథమిక అవసరంగా మారింది. ఈ తరుణంలో అంబానీ తీసుకొస్తున్న ఈ స్మార్ట్ ఇన్వర్టర్లు సామాన్యుడి ఇంట్లో వెలుగులు నింపుతాయనడంలో సందేహం లేదు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.