India-US Interim Trade Deal: అమెరికా మార్కెట్‌లో భారతీయ ఉత్పత్తుల హవా..ఈ రంగాలకు పండగే!

India-US Interim Trade Deal: భారత్-అమెరికా మధ్య చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందానికి ముహూర్తం ఖరారైంది. మార్చి నెలలో జరగనున్న ఈ ఒప్పందం, ఇరు దేశాల ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేయడమే కాకుండా 30 ట్రిలియన్ డాలర్ల అమెరికా మార్కెట్‌ను భారత్‌కు చేరువ చేయనుంది.

Update: 2026-02-08 08:40 GMT

India-US Interim Trade Deal: అమెరికా మార్కెట్‌లో భారతీయ ఉత్పత్తుల హవా..ఈ రంగాలకు పండగే!

India-US Interim Trade Deal: భారత్-అమెరికా మధ్య చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందానికి ముహూర్తం ఖరారైంది. మార్చి నెలలో జరగనున్న ఈ ఒప్పందం, ఇరు దేశాల ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేయడమే కాకుండా 30 ట్రిలియన్ డాలర్ల అమెరికా మార్కెట్‌ను భారత్‌కు చేరువ చేయనుంది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించిన ఈ ఒప్పంద వివరాలు మన రైతులు, ఎంఎస్ఎంఈలు , పారిశ్రామికవేత్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి.

ఈ ఒప్పందంతో అమెరికాలో భారతీయ ఉత్పత్తులపై పన్నులు భారీగా తగ్గనున్నాయి. దీనివల్ల మన దేశం నుంచి కింది ఉత్పత్తులు అమెరికా మార్కెట్‌లో చౌకగా లభిస్తాయి. ముఖ్యంగా జనరిక్ మెడిసిన్స్‌పై అమెరికా టారిఫ్‌లు రద్దు చేయడంతో భారత ఫార్మా రంగానికి స్వర్ణయుగం మొదలైనట్టే.దుస్తులు, పాదరక్షలు, హస్తకళా ఉత్పత్తులకు భారీ డిమాండ్ ఏర్పడనుంది. జెమ్స్, జువెల్లరీపై సున్నా టారిఫ్ వల్ల మన కార్మిక శక్తికి పెద్దపీట పడనుంది.సముద్ర ఉత్పత్తుల ఎగుమతిలో భారత్ రికార్డులు సృష్టించే అవకాశం ఉంది.

అమెరికా నుంచి విమాన విడిభాగాలు , అధునాతన యంత్ర పరికరాలు భారత్‌కు తక్కువ ధరకే వచ్చే అవకాశం ఉంది. ఇది మన తయారీ రంగాన్ని మరింత వేగవంతం చేస్తుంది.ఈ ఒప్పందంలో అత్యంత ఆసక్తికరమైన అంశం రైతు రక్షణ. అమెరికా నుంచి దిగుమతి అయ్యే కొన్ని ఉత్పత్తుల వల్ల మన రైతులు నష్టపోకుండా కేంద్రం జాగ్రత్తలు తీసుకుంది:

వరి, గోధుమలు, మొక్కజొన్న, జొన్న వంటి వాటిపై రక్షణ కల్పించారు.ఉల్లి, వెల్లుల్లి, బంగాళాదుంపలు వంటి నిత్యావసరాలకు ఎలాంటి ముప్పు లేకుండా చూశారు.ఆరెంజ్, మామిడి, ఖర్జూరం, స్ట్రాబెర్రీలు అమెరికా నుంచి దిగుమతి కాకుండా మన రైతుల ప్రయోజనాలను కాపాడారు.

ఈ ట్రేడ్ డీల్ కేవలం వ్యాపారం మాత్రమే కాదు, భారతీయ శ్రమకు గ్లోబల్ గుర్తింపు. దీనిపై రైతులు , విశ్లేషకుల నుంచి భిన్నమైన స్పందనలు వస్తున్నప్పటికీ, ఇది భారత ఎగుమతులకు సరికొత్త ద్వారాలు తెరుస్తుందనడంలో సందేహం లేదు.

Tags:    

Similar News