Gold Rates: గోల్డ్ లవర్స్‌కు మళ్లీ షాక్… ఈరోజు బంగారం ఎంత పెరిగిందంటే!

క్రిస్మస్ సమయం దగ్గరపడుతుండటంతో బంగారం ధరలు కొంచెం తగ్గుతాయేమోనని ఆశించిన పసిడి ప్రేమికులకు మరోసారి నిరాశే ఎదురైంది.

Update: 2025-12-08 05:42 GMT

Gold Rates: గోల్డ్ లవర్స్‌కు మళ్లీ షాక్… ఈరోజు బంగారం ఎంత పెరిగిందంటే!

క్రిస్మస్ సమయం దగ్గరపడుతుండటంతో బంగారం ధరలు కొంచెం తగ్గుతాయేమోనని ఆశించిన పసిడి ప్రేమికులకు మరోసారి నిరాశే ఎదురైంది. బంగారం ధరలు రోజుకోలా మారుతూనే ఉన్నాయి. ఒకరోజు స్వల్పంగా తగ్గితే, మరుసటి రోజు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. సోమవారం కూడా గోల్డ్ రేట్లు వినియోగదారులకు గట్టి షాక్ ఇచ్చాయి. తులం బంగారంపై రూ.270 పెరుగుదల నమోదైంది. అయితే వెండి ధరలు మాత్రం ఉపశమనం కలిగించాయి. కిలో వెండి ధరపై రూ.1,000 తగ్గింది.

బులియన్ మార్కెట్ ప్రకారం, ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.270 పెరిగి రూ.1,30,420కు చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.250 పెరిగి రూ.1,19,550గా ఉంది. ఇదే సమయంలో 18 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.210 పెరిగి రూ.97,820 దగ్గర ట్రేడవుతోంది.

వెండి ధరల్లో మాత్రం నెమ్మదింపు కనిపించింది. కిలో వెండిపై రూ.1,000 తగ్గడంతో బులియన్ మార్కెట్‌లో ఇది రూ.1,89,000 వద్ద అమ్ముడవుతోంది. చెన్నై, హైదరాబాద్‌లలో మాత్రం కిలో వెండి రూ.1,98,000 వద్ద ట్రేడ్ అవుతోంది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలలో కిలో వెండి రూ.1,89,000 దగ్గర లభిస్తోంది.

Tags:    

Similar News