Mutual Fund: రూ.500 పెట్టుబడితో కోటీశ్వరుడిగా మారొచ్చు.. ఈ అద్భుత ఫార్ములా మీకోసమే..!

Mutual Fund: సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం ఈ రోజుల్లో సర్వసాధారమైంది.

Update: 2023-05-08 14:30 GMT

Mutual Fund: రూ.500 పెట్టుబడితో కోటీశ్వరుడిగా మారొచ్చు.. ఈ అద్భుత ఫార్ములా మీకోసమే..!

SIP: సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం ఈ రోజుల్లో సర్వసాధారమైంది. అయితే, సరైన మార్గంలో.. క్రమశిక్షణతో పెట్టుబడి పెడితే, భారీగా ప్రయోజనం ఉంటుంది. దీర్ఘకాలంలో మంచి ఫండ్ కూడా సమకూర్చుకోవచ్చు. ఈ రోజు మనం అలాంటి ఓ గొప్ప ఫార్ములా గురించి తెలుసుకుందాం. దీనిని ఫాలో చేసి మ్యూచువల్ ఫండ్స్ నుంచి మిలియనీర్ కావచ్చు. ఆ పద్ధతి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి..

మ్యూచువల్ ఫండ్స్‌లో SIP చేయడం వల్ల దీర్ఘకాలంలో భారీగా లాభపడొచ్చు. అందువల్ల చాలా మంది మ్యూచువల్ ఫండ్ SIP పెట్టుబడిదారులు దీర్ఘకాలిక పెట్టుబడి కోసం వెళతారు. పెట్టుబడిదారుడిగా మీ లక్ష్యం రూ. 1 కోటిని కూడగట్టుకోవడమే అయితే.. మీరు అనుసరించగల సరళమైన, సమర్థవంతమైన వ్యూహం ఉంది. అదే 15x15x15 నియమం.

మ్యూచువల్ ఫండ్స్ 15x15x15 నియమం ఏంటంటే?

మ్యూచువల్ ఫండ్స్ 15x15x15 నియమం ప్రకారం, 15% వార్షిక రాబడిని ఇచ్చే ఫండ్‌లో 15 సంవత్సరాల కాలానికి ప్రతి నెలా రూ. 15,000 పెట్టుబడి పెట్టాలి. అంటే నెలలో 30 రోజుల పాటు ప్రతిరోజూ రూ.500 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ పెట్టుబడిని 15 ఏళ్లపాటు చేయాల్సి ఉంటుంది.

సరళంగా చెప్పాలంటే, సగటున 15% సమ్మేళనం వార్షిక రాబడిని ఆర్జించే ఈ ఫార్ములా కింద 15 సంవత్సరాల పాటు ప్రతి నెలా రూ. 15,000 SIP చేస్తే.. మీరు రూ. 1 కోటిని కూడబెట్టుకోవచ్చు. అంటే ప్రతి నెలా 15 వేలు పెట్టుబడి పెట్టడం ద్వారా 15 సంవత్సరాలలో మొత్తం రూ. 27 లక్షల రూపాయల పెట్టుబడి జమ చేస్తారు.

కాంపౌండింగ్ అనేది మీ వడ్డీపై వడ్డీని సంపాదించే ప్రక్రియను సూచిస్తుంది. తద్వారా మీ పెట్టుబడి కాలక్రమేణా భారీగా పెరుగుతుంది. 15% వార్షిక రాబడిని ఇచ్చే స్టాక్‌లో 15 సంవత్సరాల పాటు నెలకు కేవలం రూ. 15000 ఇన్వెస్ట్ చేయడం ద్వారా, మీరు రూ. 1,00,27,601 ఫండ్‌ను కూడబెట్టుకోవచ్చు. అంటే ఈ విధంగా కేవలం రూ.27 లక్షల పెట్టుబడిపై రూ.73 లక్షల లాభం పొందుతారు.

Tags:    

Similar News