Morus Zero Portable Dryer: 15 నిమిషాల్లో బట్టలు ఆరిపోతాయి.. ధర, ఫీచర్స్ గురించి తెలుసుకోండి..!

Morus Zero Portable Dryer: వర్షాకాలంలో బట్టలు ఆరడం అనేది పెద్ద సమస్యగా ఉంటుంది. దీంతో గృహిణులు చాలా ఇబ్బందిపడుతుంటారు.

Update: 2023-07-06 14:30 GMT

Morus Zero Portable Dryer: 15 నిమిషాల్లో బట్టలు ఆరిపోతాయి.. ధర, ఫీచర్స్ గురించి తెలుసుకోండి..!

Morus Zero Portable Dryer: వర్షాకాలంలో బట్టలు ఆరడం అనేది పెద్ద సమస్యగా ఉంటుంది. దీంతో గృహిణులు చాలా ఇబ్బందిపడుతుంటారు. తరచుగా వర్షం రావడం ఆరేసిన బట్టలు తీయడం మళ్లీ వర్షం ఆగాక మళ్లీ ఆరేయడం జరుగుతుంటుంది. దీనివల్ల వారికి చిరాకు వస్తుంది. ఈ పరిస్థితిలో బట్టలు ఆరడానికి చాలా సమయం పడుతుంది. అందుకే మోరస్ జీరో అనే కంపెనీ పోర్టబుల్ కౌంటర్‌టాప్ డ్రైయర్‌ని విడుదల చేసింది. దీని ద్వారా కేవలం 15 నిమిషాల్లో బట్టలని పొడిగా మార్చుకోవచ్చు. దీని ధర, పనితీరు గురించి వివరంగా తెలుసుకుందాం.

కౌంటర్‌టాప్ డ్రైయర్

మోరస్ జీరో అనే ఈ పోర్టబుల్ డ్రైయర్‌ 'వాక్యూమ్ + డీహైడ్రేషన్ టెక్నాలజీతో వస్తుంది. మరో మాటలో చెప్పాలంటే ఇది చాలా వేగంగా బట్టలని ఆరబెట్టే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అంటే 15 నిమిషాల్లో బట్టలు ఆరిపోతాయి. అలాగే 40 శాతం వరకు విద్యుత్‌ని ఆదా చేస్తుంది. దీన్ని పోర్టబుల్ వాషింగ్ మెషీన్‌తో కలిపి ఉంచాలి. ఈ మినీ డ్రైయర్ వేడిని, లోపల తగ్గిన గాలి పీడనాన్ని మిళితం చేసే ప్రక్రియను ఉపయోగించి బట్టలని త్వరగా ఆరబెడుతుంది.

మోరస్ జీరో డ్రైయర్‌ $299 (దాదాపు రూ. 25,000) నుంచి ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉంది. బట్టలు ఆరేయడానికి స్థలం లేనివారు లేదా తరచుగా తడి బట్టలతో ఇబ్బందిపడేవారు ఈ మిషన్‌ని కొనుగోలు చేయవచ్చు. ఇది త్వరగా బట్టలని పొడిగా మారుస్తుంది. అంతేకాకుండా వెనువెంటనే ఉతికేసి ఆరబెట్టుకోవచ్చు. దీనివల్ల సమయం ఆదా అవుతుంది. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవారికి ఇది బాగా ఉపయోగపడుతుంది.

Tags:    

Similar News