Stock Market: ఆల్ టైమ్ హై.. లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు
Stock Market: ఆల్ టైమ్ హైని చేరిన మార్కెట్లు.. 144 పాయింట్లు లాభపడిన నిఫ్టీ
Stock Market: ఆల్ టైమ్ హై.. లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు
Stock Market: దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు ఇవాళ ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. మార్కెట్‌లు ఆల్‌టైమ్‌హైను చేరాయి. ఉదయం 9:18 సమయానికి నిఫ్టీ 144 పాయింట్లు లాభపడి 22,577కు చేరింది. సెన్సెక్స్ 498 పాయింట్లు పుంజుకుని 74,369 వద్ద ట్రేడవుతోంది. అమెరికా డాలర్ ఇండెక్స్ 104.23 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 89.49 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.35 శాతానికి చేరాయి.
అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.11 శాతం లాభంతో, నాస్‌డాక్ 0.23 గ్రీన్‌లో ముగిశాయి. మార్కెట్లు భారీగా లాభపడడంతో మదుపర్లలో జోష్ కనిపిస్తోంది. దీంతో మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గ నిపుణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.