LIC New Policy: ఎల్‌ఐసీ అదిరే పాలసీ.. ప్రతి నెలా రూ. 2190 చెల్లిస్తే సులువుగా 10 లక్షల లాభం..!

LIC New Policy: మీరు తక్కువ పెట్టుబడితో భవిష్యత్తులో మంచి ఫండ్‌ పొందాలంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) బెస్ట్‌ అని చెప్పవచ్చు.

Update: 2022-08-08 15:30 GMT

LIC New Policy: ఎల్‌ఐసీ అదిరే పాలసీ.. ప్రతి నెలా రూ. 2190 చెల్లిస్తే సులువుగా 10 లక్షల లాభం..!

LIC New Policy: మీరు తక్కువ పెట్టుబడితో భవిష్యత్తులో మంచి ఫండ్‌ పొందాలంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) బెస్ట్‌ అని చెప్పవచ్చు. ఇందులో కొత్త జీవన్ ఆనంద్ పాలసీని తీసుకుంటే తక్కువ డిపాజిట్‌తో మెచ్యూరిటీపై రూ. 10 లక్షలు సంపాదించవచ్చు. బీమా చేసిన వ్యక్తి జీవితకాల మరణ రక్షణ, పన్ను మినహాయింపు కూడా పొందుతారు. రూ.10 లక్షల కార్పస్ పొందడానికి మీరు ప్రతి నెలా రూ.2190 పెట్టుబడి పెట్టాలి.

కొత్త జీవన్ ఆనంద్ పాలసీని 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి తీసుకోవచ్చు. ఈ పాలసీ కనీస వ్యవధి 15, గరిష్టంగా 35 సంవత్సరాలు. ఇందులో హామీ ఇవ్వబడిన మొత్తానికి పరిమితి లేదు. ఎల్‌ఐసీ ఈ ప్లాన్‌లో ప్రీమియం చెల్లించడానికి పాలసీదారుకు అనేక ఎంపికలను అందించింది. మీరు కొత్త జీవన్ ఆనంద్ పాలసీ వాయిదాను ఏటా, అర్ధ సంవత్సరం, త్రైమాసికం లేదా నెలవారీ కూడా చెల్లించవచ్చు.

మీరు ఈ పాలసీని 24 సంవత్సరాల వయస్సులో రూ. 5 లక్షల బీమాతో కొనుగోలు చేస్తే సంవత్సరానికి సుమారు రూ. 26815 డిపాజిట్ చేయాలి. రోజు ఆధారంగా చూస్తే రూ.73.50, నెల ప్రకారం రూ.2190. మీరు 21 సంవత్సరాల పాటు పాలసీని తీసుకున్నట్లయితే మొత్తం పెట్టుబడి దాదాపు 5.63 లక్షలకు చేరుకుంటుంది. బోనస్‌తో రూ. 10 లక్షల కంటే ఎక్కువ పొందుతారు. ఇది సమ్ అష్యూర్డ్, సింపుల్ రివర్షనరీ బోనస్, చివరి అదనపు బోనస్ రూపంలో ఉంటుంది. ఇది మాత్రమే కాదు మీరు పాలసీపై రుణం కూడా తీసుకోవచ్చు.

Tags:    

Similar News