LIC Plan: తక్కువ పెట్టుబడితో.. అధిక లాభాలు.. ఎల్‌ఐసీ కొత్త ఎండోమెంట్ ప్లస్ ప్లాన్‌ పీచర్లు చూస్తే పరేషానే..!

LIC New Endowment Plus Plan: తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందగలిగే పథకంలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా.. అయితే, మీకోసమే ఈ శుభవార్త. LIC న్యూ ఎండోమెంట్ ప్లస్ గురించి తప్పక తెలుసుకోవాలి.

Update: 2023-06-26 11:50 GMT

LIC Plan: తక్కువ పెట్టుబడితో.. అధిక లాభాలు.. ఎల్‌ఐసీ కొత్త ఎండోమెంట్ ప్లస్ ప్లాన్‌ పీచర్లు చూస్తే పరేషానే..!

LIC New Endowment Plus Plan: తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందగలిగే పథకంలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా.. అయితే, మీకోసమే ఈ శుభవార్త. LIC న్యూ ఎండోమెంట్ ప్లస్ గురించి తప్పక తెలుసుకోవాలి. LIC న్యూ ఎండోమెంట్ ప్లస్ అనేది యూనిట్-లింక్డ్, రెగ్యులర్ ప్రీమియం, నాన్-పార్టిసిపేటింగ్ ఇన్సూరెన్స్ ప్లాన్, ఇది పాలసీదారునికి పొదుపు, బీమా ఎంపికల జంట ప్రయోజనాలను అందిస్తుంది. పాలసీదారునికి భద్రత, దీర్ఘకాల పొదుపు మంచి కలయికను అందించే లక్ష్యంతో ఈ పథకం ప్రారంభించింది.

పాత ప్లాన్‌కు అప్‌డేట్ వర్షన్..

ఈ పథకం కింద, పాలసీదారుడు బాండ్, సెక్యూరిటీ, బ్యాలెన్స్‌డ్, గ్రోత్ ఫండ్ వంటి నాలుగు ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌ల నుంచి ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. పాత ఎండోమెంట్ ప్లస్ ప్లాన్ (టేబుల్ నం. 835), ఇది 2015లో ప్రారంభించింది. LIC దీన్ని 1 ఫిబ్రవరి 2020న రద్దు చేసింది. కొత్త ఎండోమెంట్ ప్లస్ ప్లాన్ (టేబుల్ నం. 935) ప్రవేశపెట్టింది.

ప్రీమియం-చెల్లించే వ్యవధి..

పాలసీదారుడు పాలసీ మెచ్యూరిటీ వ్యవధి వరకు మాత్రమే ఆన్‌లైన్ చెల్లింపు విధానం ద్వారా వార్షిక, అర్ధ-వార్షిక, త్రైమాసిక లేదా నెలవారీ వ్యవధిలో క్రమం తప్పకుండా ప్రీమియం చెల్లించవచ్చు. వార్షిక, అర్ధ-వార్షిక లేదా త్రైమాసిక ప్రీమియంల చెల్లింపు కోసం 30 రోజుల గ్రేస్ పీరియడ్ ఇచ్చింది. అయితే, గడువు తేదీ తప్పితే నెలవారీ ప్రీమియంలకు 15 రోజుల గ్రేస్ పీరియడ్ ఇచ్చింది.

అర్హత, వయో పరిమితి..

LIC కొత్త ఎండోమెంట్ ప్లస్ ప్లాన్‌ని కొనుగోలు చేయడానికి కనీస వయస్సు 90 రోజులు. కాగా, గరిష్ట వయస్సు 50 సంవత్సరాలు. పాలసీ మెచ్యూరిటీకి వయోపరిమితి కనిష్టంగా 18 సంవత్సరాలు, గరిష్టంగా 60 సంవత్సరాలు.

డెత్ బెనిఫిట్..

రిస్క్ ప్రారంభ తేదీకి ముందే పాలసీదారు మరణిస్తే, మొత్తం ఫండ్ విలువ నామినీకి చెల్లించబడుతుంది. అయితే, రిస్క్ ప్రారంభమైన తేదీ తర్వాత పాలసీదారు మరణిస్తే, కింది మొత్తాలలో ఎక్కువ మొత్తం చెల్లించబడుతుంది:

చెల్లించిన మొత్తం ప్రీమియంలలో 105%

వార్షిక ప్రీమియం కంటే 10 రెట్లు.

నికర ఫండ్ విలువ.

Tags:    

Similar News