LIC Policy: ఎల్‌ఐసీ బెస్ట్‌ పాలసీ.. మిగతావాటికంటే చాలా భిన్నం.. ప్రయోజనాలు ఏంటంటే..?

LIC Policy: దేశంలోని అతిపెద్ద బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC).

Update: 2023-03-31 14:30 GMT

LIC Policy: ఎల్‌ఐసీ బెస్ట్‌ పాలసీ.. మిగతావాటికంటే చాలా భిన్నం.. ప్రయోజనాలు ఏంటంటే..?

LIC Policy: దేశంలోని అతిపెద్ద బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC). ఈ కంపెనీ పాలసీలు చాలా ప్రజాదరణ పొందాయి. ఇందులో 'జీవన్ ఆజాద్' పాలసీ ప్రజల్లో ఉత్కంఠ రేపుతోంది. ఈ పాలసీ తీసుకున్న కస్టమర్లు మంచి ప్రయోజనాలు పొందుతారు. ఇది ఒక కొత్త ఎండోమెంట్ ప్లాన్. చాలా కాలం తర్వాత కంపెనీ ఇలాంటి ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో బీమా రక్షణను పొందడం ఖాయం. అలాగే మెచ్యూరిటీ సందర్భంగా చాలా వరకు ఆదా చేయవచ్చు. ఈ పాలసీ ఇతర బీమా పాలసీల కంటే భిన్నమైనది.

కనీస బీమా రూ. 2 లక్షలు

'జీవన్‌ ఆజాద్‌' పాలసీ తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లయితే కనీసం రూ.2 లక్షల బీమా తీసుకోవాల్సి ఉంటుంది. గరిష్టంగా రూ. 5 లక్షల బీమా తీసుకోవచ్చు. వినియోగదారుడు రూ.3 లక్షల వరకు బీమా తీసుకుంటే అతను ఎలాంటి వైద్య పరీక్షలు చేయించుకోనవసరం లేదు. అయితే ఈ మొత్తం కంటే ఎక్కువ బీమా కోసం వైద్య పరీక్ష చేయించుకోవలసి ఉంటుంది. ఈ బీమా మూడు నెలల పిల్లల నుంచి 50 సంవత్సరాల వయస్సు వరకు చేయవచ్చు. 'జీవన్ ఆజాద్' పాలసీ కనీస మెచ్యూరిటీ వ్యవధి 15 సంవత్సరాలు, గరిష్ట మెచ్యూరిటీ వ్యవధి 20 సంవత్సరాలు.

'జీవన్ ఆజాద్' పాలసీకి ప్రీమియం నెలవారీ, త్రైమాసికం, అర్ధ సంవత్సరం, వార్షిక ప్రాతిపదికన చెల్లించవచ్చు. దీన్ని ఆన్‌లైన్‌లో, చెక్కు, కార్డ్ లేదా UPI నుంచి డిపాజిట్ చేయవచ్చు. మీరు 15 ఏళ్లపాటు బీమా ప్లాన్ తీసుకుంటే కేవలం 7 ఏళ్లు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. 20 ఏళ్ల వ్యవధితో ప్లాన్‌లో ఉన్నప్పుడు ఈ పరిమితి 12 ఏళ్లుగా ఉంటుంది. 'జీవన్ ఆజాద్' బీమా పాలసీ మెచ్యూర్ అయినప్పుడు కనీస పరిమితి రూ. 2 లక్షలు, గరిష్టంగా రూ. 5 లక్షల ప్రకారం పూర్తి డబ్బు పొందుతారు.

మరోవైపు బీమా చేసిన వ్యక్తి మరణించినట్లయితే నామినీకి బీమా మొత్తం లభిస్తుంది. మరణించిన సందర్భంలో నామినీకి హామీ మొత్తం కంటే ఎక్కువ లభిస్తుంది. ఇది వార్షిక ప్రీమియంకు 7 రెట్లు సమానంగా ఉంటుంది. అంటే మొత్తం ప్రీమియంలో కనీసం 105 శాతం ఉండాలి. మరోవైపు పిల్లల పేరుతో పాలసీని కలిగి ఉంటే బీమా వ్యవధిలో మరణిస్తే మొత్తం ప్రీమియం తిరిగి చెల్లిస్తారు. ఇందులో పన్నులు, అదనపు ప్రీమియం, రైడర్ ప్రీమియం ఉండవు. ఈ స్కీంలో రుణ సదుపాయాన్ని కూడా పొందవచ్చు.

Tags:    

Similar News