CVV, CVC నంబర్ల గురించి తెలుసా.. వీటిని ఎందుకు ఉపయోగిస్తారంటే..?
CVV and CVC Numbers: ఆన్‌లైన్ లేదా ఫోన్ ద్వారా కొనుగోళ్లు చేసినప్పుడు సెల్లర్స్ మీ క్రెడిట్/డెబిట్ కార్డ్ నంబర్, కార్డ్ ఎక్స్‌పైర్ డేట్‌ను అడగడం మనం గమనించే ఉంటాం.
CVV, CVC నంబర్ల గురించి తెలుసా.. వీటిని ఎందుకు ఉపయోగిస్తారంటే..?
CVV and CVC Numbers: ఆన్‌లైన్ లేదా ఫోన్ ద్వారా కొనుగోళ్లు చేసినప్పుడు సెల్లర్స్ మీ క్రెడిట్/డెబిట్ కార్డ్ నంబర్, కార్డ్ ఎక్స్‌పైర్ డేట్‌ను అడగడం మనం గమనించే ఉంటాం. ఎక్కువగా CVV నంబర్ అడుగుతారు. మీరు వివరాలు ఇస్తే తప్ప ఆ ట్రాన్జాక్షన్ పూర్తికాదు. మీరు షాపింగ్ చేసిన ప్రతిసారీ CVV నంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇది ఏంటో ఎందుకు అవసరమో పూర్తి వివరాలు తెలుసుకుందాం.
CVV నంబర్ అనేది క్రెడిట్, డెబిట్ కార్డ్ వెనుక, దాని మాగ్నెటిక్ స్ట్రిప్ దగ్గర ఉండే 3 అంకెల సంఖ్య. CVV అంటే కార్డ్ వెరిఫికేషన్ విలువ, CVC అంటే కార్డ్ వెరిఫికేషన్ కోడ్. చాలా ఏజెన్సీలు CVV నంబర్లకు వివిధ పేర్లను కలిగి ఉంటాయి. మాస్టర్ కార్డ్ CVV కోడ్‌ను CVC2గా సూచిస్తుంది. VISA దానిని CVV2గా సూచిస్తుంది. AmEx దానిని కార్డ్ ఐడెంటిఫికేషన్ నంబర్ (CID)గా సూచిస్తుంది.
ఆన్‌లైన్‌లో షాపింగ్ చేస్తున్నప్పుడు మీరు ఈ కోడ్‌ను ఎంటర్ చేయాలి. CVV నంబర్ తెలియకుండా హ్యాకర్లు ఎలాంటి లావాదేవీని పూర్తి చేయలేరు. ఇంతకు ముందు CVV నంబర్ ద్వారా మాత్రమే చెల్లింపు జరిగేది కానీ ఇప్పుడు కార్డ్ భద్రత కోసం OTP, 3D సురక్షిత పిన్ తప్పనిసరి చేశారు. కాబట్టి ఏదైనా సైట్‌లో లావాదేవీలు CVVతో పాటు OTP ధృవీకరణ, 3D సురక్షిత పిన్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అయినప్పటికీ చాలా వెబ్‌సైట్‌లు ఇప్పటికీ CVV నంబర్, OTP తర్వాత మాత్రమే చెల్లింపును ప్రాసెస్ చేస్తున్నాయి.