Alone Women Railway Rules: ఒంటరి మహిళల విషయంలో రైల్వే నిబంధనలు కాస్త భిన్నం.. ఎందుకంటే..?

Alone Women Railway Rules: భారతీయ రైళ్లలో ప్రతిరోజు లక్షలమంది ప్రయాణిస్తారు. ఎందుకంటే ఇందులో ప్రయాణం చాలా చౌక అంతేకాకుండా అధిక దూరం ప్రయాణించవచ్చు.

Update: 2024-01-04 14:30 GMT

Alone Women Railway Rules: ఒంటరి మహిళల విషయంలో రైల్వే నిబంధనలు కాస్త భిన్నం.. ఎందుకంటే..?

Alone Women Railway Rules: భారతీయ రైళ్లలో ప్రతిరోజు లక్షలమంది ప్రయాణిస్తారు. ఎందుకంటే ఇందులో ప్రయాణం చాలా చౌక అంతేకాకుండా అధిక దూరం ప్రయాణించవచ్చు. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు మిగతా రవాణా వ్యవస్థలతో పోలిస్తే తక్కువ ఖర్చుతో ప్రయాణించవచ్చు. అందుకే చాలామంది రైల్వే ప్రయాణంపై మొగ్గుచూపుతారు.

అయితే కొన్నిసార్లు అందరికి టిక్కెట్లు దొరకడం కాస్త కష్టమే. కొంతమందికి కొన్ని సమయాల్లో టిక్కెట్లు కన్ఫర్మ్ కాని పరిస్థితి ఉంటుంది. అయినప్పటికీ రైలులో ప్రయాణిస్తారు. వాస్తవానికి టిక్కెట్లు లేకుండా రైలులో ప్రయాణించడం శిక్షార్హమైన నేరం. TT మిమ్మల్ని రైలు నుంచి కిందికి దింపేస్తాడు. అంతేకాకుండా జరిమానా నుంచి జైలు శిక్ష వరకు ఉంటుంది. అయితే ఈ నిబంధనలు ఒంటరి మహిళ విషయంలో వేరుగా ఉంటాయి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

నిజానికి రైలులో టికెట్ లేకుండా ప్రయాణికుడు పట్టుబడితే TT అతన్ని తదుపరి స్టేషన్‌లో దింపేస్తాడు. అయితే ఒక మహిళ ఒంటరిగా ఉండి టికెట్ తీసుకోని పక్షంలో అలా చేయలేరు. ఈ విషయంలో రైల్వే నిబంధనలు కాస్త భిన్నంగా ఉంటాయి. ఒంటరి మహిళ టిక్కెట్ లేకుండా దొరికితే ఏ స్టేషన్‌లో కోచ్ నుంచి దింపలేరు. వారు ప్రమాదంలో పడే అవకాశాలు ఉంటాయని టీటీ వారిని కోచ్‌ నుంచి దింపరు. వారిని సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లే బాధ్యత జీఆర్పీ లేదా ఆర్పీఎఫ్‌పై ఉంటుంది. జవాన్లు మహిళను ఎస్కార్ట్ చేస్తారు. ఆమె వదిలిపెట్టిన చోట సురక్షితంగా ఉండేలా చూస్తారు. తర్వాత మాత్రమే తిరిగి రైలుకు వస్తారు.

Tags:    

Similar News