Money Investing: నెలకి రూ.15000 పొదుపుతో కోటి రూపాయల సంపాదన.. ఆచరిస్తే అద్భుతం..!

Money Investing: మీరు పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే ఎల్లప్పుడూ ఒక నియమాన్ని గుర్తుంచుకోండి.

Update: 2023-03-16 07:15 GMT

Money Investing: నెలకి రూ.15000 పొదుపుతో కోటి రూపాయల సంపాదన.. ఆచరిస్తే అద్భుతం..!

Money Investing: మీరు పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే ఎల్లప్పుడూ ఒక నియమాన్ని గుర్తుంచుకోండి. దీనిప్రకారం 15 సంవత్సరాలలో కోటి రూపాయలు సంపాదిస్తారు. 15*15*15 ఆర్థిక నియమం దీర్ఘకాలంలో మీ సంపాదనని పెంచుతుంది. ఇందులో 15 శాతం వార్షిక వృద్ధి రేటుతో 15 ఏళ్ల పాటు నెలకు రూ.15,000 పెట్టుబడి పెట్టాలి. ఈ నియమాన్ని అనుసరించడం వల్ల పదవీ విరమణ లేదా ఇతర ఆర్థిక లక్ష్యాల కోసం తగిన కార్పస్‌ను రూపొందించుకోవచ్చు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

ఈ నియమాన్ని అనుసరించడానికి మీరు ప్రతి నెల రూ.15,000 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. దీన్ని సాధించడానికి స్టాక్‌లు, మ్యూచువల్ ఫండ్స్ లేదా ఏదైనా ఇతర పెట్టుబడి మార్గంలో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP)ని ఎంచుకోవచ్చు. ప్రతి నెలా నిర్ణీత మొత్తంలో పెట్టుబడి పెట్టడం వల్ల మీరు రూపాయి ధర సగటును ఎక్కువగా ఉపయోగించుకోవచ్చు. మీ పోర్ట్‌ఫోలియోపై మార్కెట్ హెచ్చుతగ్గుల ప్రభావాన్ని తగ్గించవచ్చు. సంవత్సరానికి 15 శాతం వృద్ధి రేటు అనేది ముఖ్యమైన అంశం. ఇది చాలా ఎక్కువగా అనిపించినప్పటికీ సుదీర్ఘ కాలంలో ఈక్విటీ పెట్టుబడుల ద్వారా దీనిని సాధించవచ్చు.

భారతీయ స్టాక్ మార్కెట్ గత కొన్ని దశాబ్దాలుగా దాదాపు 15 శాతం వార్షిక రాబడిని అందించింది. ఇది బాండ్లు, FDలు, బంగారం వాటికంటే చాలా ఎక్కువ. మీ ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి 15 సంవత్సరాల పెట్టుబడి ముఖ్యం. దీనివల్ల ఆర్థిక పటుత్వం సాధించవచ్చు. మీ పెట్టుబడి మరింత రాబడిని అందిస్తుంది. తద్వారా మీ పోర్ట్‌ఫోలియో పెరుగుతుంది. ఏడాదికి 15 శాతం వృద్ధి రేటుతో నెలకు రూ.15,000 ఇన్వెస్ట్ చేస్తే 15 సంవత్సరాల తర్వాత మీ ఫండ్ దాదాపు రూ.1.38 కోట్లు అవుతుంది. ఇది మీ పిల్లల చదువుకు, ఇల్లు కొనడానికి తదితర ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి సహాయపడుతుంది.

Tags:    

Similar News