Cyber Attack: దేశంలో మరోసారి సైబర్ దాడుల కలకలం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్చరిక..!

Cyber Attack: దేశంలో సైబర్ దాడులు మరోసారి కలకలం రేపుతున్నాయి.

Update: 2023-04-14 13:17 GMT

Cyber Attack: దేశంలో మరోసారి సైబర్ దాడుల కలకలం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్చరిక..!

Cyber Attack: దేశంలో సైబర్ దాడులు మరోసారి కలకలం రేపుతున్నాయి. ఇండోనేషియా కేంద్రంగా సైబర్ అటాక్ గ్రూప్స్ భారత్ లోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 12వేల వెబ్ సైట్లపై దాడులకు పాల్పడే అవకాశం ఉందంటూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చెందిన'ఇండియన్ సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్ సెంటర్ (I4C)సైబర్ సెక్యూరిటీ విభాగం కేంద్రానికి హెచ్చరికలు జారీ చేసింది.

గత ఏడాది సైబర్ నేరస్తులు ర్యాన్సమ్ వేర్ ను ఉపయోగించి ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (AIIMS)పై సైబర్ దాడులు చేశారు. దీంతో రెండు వారాల పాటు సర్వర్లు డౌన్ అయ్యాయి. పనిచేయడం మానేశాయి. ఆస్పత్రిలో కార్యకలాపాలు స్తంభించిపోయాయి. ముఖ్యంగా ఎయిమ్స్ లో చికిత్స తీసుకున్న సామాన్యుల నుంచి మాజీ ప్రధానుల హెల్త్ డేటా ప్రమాదంలో పడింది. ఎయిమ్స్ తర్వాత భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌)పై హాంకాంగ్‌కు చెందిన హ్యాకర్లు 6వేల సార్లు టార్గెట్ చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే అప్‌డెట్‌ ఫైర్‌వాల్‌, పటిష్టమైన భద్రత ఉండటం కారణంగా వెబ్ సైట్ కు ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాలేదని అన్నారు. ఇక 2022 లో భారత్ కు చెందిన వివిధ ప్రభుత్వ సంస్థలపై 19 ర్యాన్సమ్ వేర్ దాడులు జరగ్గా.. ఈ దాడులు 2021లో మూడు సార్లు జరిగాయి.

తాజాగా సైబర్ దాడులతో కేంద్రం అప్రమత్తమైంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అన్నీ శాఖలను అప్రమత్తం చేసింది. ఇండోనేషియా "హాక్టివిస్ట్" పేరతో డినైనల్ ఆఫ్ సర్వీసెస్ (DoS)ని ప్రారంభిస్తోందని, డిస్ట్రిబ్యూటెడ్ ఆఫ్ డినైల్ ఆఫ్ సర్వీసెస్(DDOS)వంటి దాడులకు పాల్పడినట్లు కేంద్ర మోం మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. అంటే దాడులు (DDoS)అనేక వ్యక్తిగత కంప్యూటర్ల నుండి ఏకకాలంలో డేటాను పంపించి తద్వారా కంప్యూటర్ నెట్ వర్క్ పని చేయకుండా నిలిపివేయడమని తెలిపింది. హాక్టివిస్ట్ చేసిన ఈ అటాక్స్ లో కేంద్ర, రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ వెబ్ సైట్ లు ఉన్నాయనే అనుమానం వ్యక్తం చేసింది.

ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సోషల్ మీడియా, ఈమెయిల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. అనుమానాస్పద లింక్ లను క్లిక్ చేయొద్దని సైబర్‌ సెక్యూరిటీ సంస్థ పింగ్‌సేఫ్ వ్యవస్థాపకుడు, సీఈఓ ఆనంద్ ప్రకాష్ తెలిపారు.

Tags:    

Similar News