Mutual Fund: మ్యూచ్‌వల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేశారా.. ఈ పనిచేయకుంటే చాలా నష్టపోతారు..!
Mutual Fund: మ్యూచువల్ ఫండ్‌లో డబ్బు పెట్టుబడి పెట్టినట్లయితే KYCని సకాలంలో పూర్తి చేయాలి.
Mutual Fund: మ్యూచ్‌వల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేశారా.. ఈ పనిచేయకుంటే చాలా నష్టపోతారు..!
Mutual Fund: మ్యూచువల్ ఫండ్‌లో డబ్బు పెట్టుబడి పెట్టినట్లయితే KYCని సకాలంలో పూర్తి చేయాలి. ఇందుకోసం సెబీ చివరి తేదీని ప్రకటించింది. ఒకవేళ kycని సకాలంలో పూర్తి చేయకపోతే భారీ నష్టాలను చవిచూడాల్సి రావచ్చు. మ్యూచువల్ ఫండ్ హౌస్ పథకంలో పెట్టుబడి పెట్టడానికి ముందు KYC ఫార్మాలిటీలు పూర్తయ్యాయని కచ్చితంగా నిర్ధారించుకోవాలి. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
నవంబర్ 1, 2022కి ముందు KYC కోసం అధికారికంగా ఆధార్‌ని ఒరిజినల్ వెరిఫికేషన్ డాక్యుమెంట్‌లుగా (OVD) ఉపయోగించిన మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్‌లు తమ KYCని మళ్లీ వెరిఫై చేయాల్సి ఉంటుంది. దీని కోసం వారికి 30 ఏప్రిల్ 2023 వరకు మాత్రమే సమయం ఉంది. దీని తర్వాత మీరు ఇబ్బందులను ఎదుర్కోవలసి రావచ్చు. సెబీ ఇంకా కట్-ఆఫ్ తేదీని పొడిగించలేదు. కాబట్టి రీ-కేవైసీకి చివరి తేదీ ఏప్రిల్ 30, 2023 మాత్రమే అని గుర్తుంచుకోండి.
KYCని ఎవరు నిర్వహిస్తారు?
SEBIతో నమోదు చేసుకున్న సంస్థలు KYC రికార్డులను మెయింటెన్ చేస్తాయి. KYC రిజిస్ట్రేషన్ ఏజెన్సీని KRA అని కూడా పిలుస్తారు. మీరు ఆఫ్‌లైన్ లేదా ఆన్‌లైన్ మోడ్ రెండింటి ద్వారా KYC చేయవచ్చు. ఈ పనిని ఏదైనా KRA లేదా AMC కార్యాలయంలో కూడా పూర్తి చేయవచ్చు.
KYC ఎలా తనిఖీ చేయాలి?
ఎవరైనా KYC ప్రక్రియను తనిఖీ చేయవచ్చు. దీని కోసం KRA లేదా ఫండ్ హౌస్ వెబ్‌సైట్‌లో పాన్ వివరాలను నింపాలి. తర్వాత KYC స్టేటస్‌ని చూస్తారు. దీనిలో ఈ ప్రక్రియ పూర్తయిందా లేదా ఏవైనా వివరాలు మిస్ అయ్యాయా లేదా మారిన కొత్త తేదీ ఏంటో చెక్ చేయవచ్చు.
KYCని ఎలా అప్‌డేట్ చేయాలి?
KYCని అప్‌డేట్ చేయడానికి మీరు పాన్, మొబైల్ నంబర్, బ్యాంక్ వివరాలను అందించాలి. మార్పునకు సంబంధించిన ఫారమ్‌ను అవసరమైన అన్ని డాక్యుమెంట్‌లతో సమర్పించాలి. ఈ పత్రాలలో రద్దు చేసిన చెక్కు, చిరునామా రుజువు ఉండాలి.