Saudi Arabia: సౌదీ అరేబియాలో లక్ష రియాల్స్ సంపాదించారా? ఇండియాకి తిరిగి వస్తే దాని ధర ఎంతో తెలిస్తే షాకే!
Saudi Arabian riyals currency
Saudi Arabia: సౌదీ అరేబియా...అదో అందమైన ప్రపంచం. అక్కడికి వెళ్లాలని చాలా మంది కలలు కంటుంటారు. పెద్ద పెద్ద భవనాలు..షేక్ ల విలాసవంతమైన లైఫ్ స్టైల్ చాలా మందిని ఆకట్టుకుంటుంది. సౌదీ అరేబియాలో భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి పెద్ద సంఖ్యలో కార్మికులు పనిచేస్తుంటారు. సౌదీలో దాదాపు 24లక్షల మంది భారతీయులు పనిచేస్తున్నారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చెబుతోంది. వీరిలో ఎక్కువ మంది భవన నిర్మాణ కార్మికులే ఉన్నారు. అంతేకాదు ఉద్యోగులు లేదా వ్యాపారాలు చేసే వారు కూడా ఉణ్నారు. అయితే ప్రతి ఏడాది మజ్, ఉమ్రాకోసం మిలియన్ల మంది భారతీయులు సౌదీకి వెళ్తుంటారు.
ఇక సౌదీ కరెన్సీని సౌదీ రయాల్ అని పిలుస్తారు. 1 రియాల్ భారతీయ కరెన్సీలో రూ. 22.34. ఇప్పుడు అక్కడ ఎవరైనా లక్షతో సౌదీ వెళ్తే అతినికి ప్రతిఫలంగా ఎంత డబ్బు వస్తుందో చూద్దాం. 1 రియాల్ 22.34 రూపాయలు. అంటే సౌదీ అరేబియాలో లక్ష భారతీయ రూపాయలు.. 4,476.11 రియాల్స్. అదే విధంగా ఒక వ్యక్తి లక్ష సౌదీ రియాల్స్ తో భారత్ వస్తే అది భారత కరెన్సీలో రూ. 22,34,073.51 అవుతుంది.
ప్రస్తుతం సౌదీని రాజు సల్మాన్ పాలిస్తున్నారు. సౌదీ అరేబియా భారత్ తో మంచి సంబంధాలు కొనసాగిస్తోంది. సౌదీని సందర్శించే భారతీయ పర్యాటకుల సంఖ్య కూడా ఎక్కువే. సౌదీ పర్యాటక శాఖ నివేదిక ప్రకారం సౌదీ అరేబియాను సందర్శించే భారతీయ పర్యాటకుల సంఖ్య 2022 నుంచి 2023 వరకు 50శాతం, 2023లోనే దాదాపు 1.5 మిలియన్ల మంది భారతీయులు సౌదీ అరేబియాకు వెళ్లినట్లు చెబుతున్నాయి.