Home Loan Prepayment: హోమ్‌లోన్ ప్రీ పేమెంట్ లాభమా.. నష్టమా..!
Home Loan Prepayment: సొంతింటి కల ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఇందుకోసం కొంతమంది దీర్ఘకాలికంగా డబ్బులు పొదుపు చేసి కల నెరవేర్చుకుంటారు.
Home Loan Prepayment:హోమ్‌లోన్ ప్రీ పేమెంట్ లాభమా.. నష్టమా..!
Home Loan Prepayment: సొంతింటి కల ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఇందుకోసం కొంతమంది దీర్ఘకాలికంగా డబ్బులు పొదుపు చేసి కల నెరవేర్చుకుంటారు. మరికొంతమంది హోమ్‌లోన్‌పై ఆధారపడి ఇల్లు లేదా ఫ్లాట్ నిర్మించడమో, కొనడమో చేస్తారు. అయితే ఎక్కువ మంది ఈ రోజుల్లో హోమ్‌లోన్‌పైనే ఆధారపడుతున్నారు. దీనిని తీసుకోవడం సులభమే కానీ ఈఎంఐలు ఏళ్ల తరబడి చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేస్తుంది. అందుకే కొంతమంది హోమ్‌లోన్ తీసుకొని రెండు, మూడేళ్ల తర్వాత ప్రీ పేమెంట్ చేసి క్లోజ్ చేయాలనుకుంటారు. అయితే దీనివల్ల నష్టమా, లాభమా ఈ రోజు తెలుసుకుందాం.
కొంతమంది హోమ్‌లోన్ తీసుకున్న వెంటనే అనుకోకుండా పెద్ద మొత్తంలో డబ్బు వస్తే ప్రీ పెమెంట్ చేద్దామని అనుకుంటారు. అయితే హోమ్‌లోన్ తీసుకున్న కొత్తలో ఈఎంఐలో వడ్డీ భాగం ఎక్కువగా ఉంటుంది. దీనిని ఆ విధంగా ఉండేలా బ్యాంకులు సెట్ చేస్తాయి. సంవత్సరా లు గడిచినా కొద్దీ వడ్డీ తగ్గుతూ వస్తుంది. హోమ్ లోన్‌ను పూర్తిగా తిరిగి చెల్లించడానికి పెద్ద మొత్తాన్ని ఉపయోగిస్తే అధిక వడ్డీ రేటుతో చెల్లించాల్సి ఉంటుంది.
హోమ్‌లోన్ వడ్డీ సాధారణంగా 9 శాతం కంటే ఎక్కువ ఉంటుంది. అయితే ప్రీ పేమెంట్ కోసం అత్యవసర నిధిని ఉపయోగించవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఎమర్జెన్సీ అనేది ఎప్పుడైనా సంభవించవచ్చు కాబట్టి ఎమర్జెన్సీ ఫండ్‌లోని డబ్బు తాకకూడదని పేర్కొంటున్నా రు. మీరు పొదుపు ఖాతాలో మిగులు నగదు లేదా మిగులు ఎఫ్‌డీ వంటి రుణ సాధనాలను కలిగి ఉంటే వాటిపై వడ్డీ తక్కువగా వస్తుంటే విత్ డ్రా చేసి హోమ్ లోన్ చెల్లించవచ్చు. ఇలా ఈఎంఐ ఎక్కువగా చెల్లించి హోమ్‌లోన్ క్లోజ్ చేసుకోవడం ఉత్తమం.