బీమా పాలసీలపై జీఎస్టీ రద్దు: సామాన్య ప్రజలకు ఆర్థిక భారం తగ్గుతుంది

ఇటీవల జరిగిన 56వ జీఎస్టీ మండలి సమావేశంలో ప్రజలకు అనుకూలంగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది భారత ప్రభుత్వం.

Update: 2025-09-10 12:22 GMT

ఇటీవల జరిగిన 56వ జీఎస్టీ మండలి సమావేశంలో ప్రజలకు అనుకూలంగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది భారత ప్రభుత్వం. ఆరోగ్య బీమా (Health Insurance) ,జీవన బీమా (Life Insurance) పాలసీలపై ఇప్పటివరకు వసూలు చేస్తున్న 18% జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం సాధారణ ప్రజానీకానికి, మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ఉపశమనం కలిగించనుంది, ఎందుకంటే బీమా ప్రీమియం మొత్తాలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.

ఇందువల్ల, ఇప్పటికే ఉన్న పాలసీదారులకే కాదు, కొత్తగా బీమా తీసుకునే వారికి కూడా ఈ ప్రోత్సాహకం లభిస్తుంది. ఉదాహరణకు, రూ. 50,000 విలువైన పాలసీపై మునుపు రూ. 9,000 వరకూ అదనపు జీఎస్టీ చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు అది పూర్తిగా తగ్గిపోవడం వల్ల ప్రజలు ఎక్కువ మొత్తంలో బీమా కవరేజ్ తీసుకోవడానికి ఆసక్తి చూపే అవకాశం ఉంది. ఇది బీమా రంగంలో విస్తృతంగా పాలసీల పెరుగుదలకు దోహదపడుతుంది.

ఈ నిర్ణయం ద్వారా భారత ప్రభుత్వం ఆరోగ్య భద్రతను ప్రోత్సహిస్తూ, బీమా సేవలను అందుబాటులోకి తేవాలనే లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తోంది. ప్రజలు చిన్న వయస్సులోనే బీమా తీసుకోవాలని ఉత్సవాహం చూపుతారు, తద్వారా ఆర్థిక రక్షణతోపాటు ఆరోగ్య భద్రత కూడా సమర్థంగా పొందగలుగుతారు. దీని వలన హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న లేదా తీసుకోవాలన్న వారికి భారీ ఊరట లభించినట్లు అవుతుంది.

Tags:    

Similar News