Gold Rate Today: పసిడి ప్రియులకు బిగ్ షాక్..మళ్లీ పెరిగిన బంగారం ధరలు..తులం ఎంతంతే..?
Gold Rate Today: పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్. పసిడి ధరలు మళ్ళీ ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి.
Gold Rate Today: పసిడి ప్రియులకు బిగ్ షాక్..మళ్లీ పెరిగిన బంగారం ధరలు..తులం ఎంతంతే..?
Gold Rate Today: పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్. పసిడి ధరలు మళ్ళీ ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. అంతర్జాతీయంగా అనిశ్చితి, మరోవైపు దేశీయంగా పెళ్లిళ్ల సీజన్ షురూ అవుతుండటంతో డిమాండ్ పెరిగి ధరలు చుక్కలను తాకుతున్నాయి. గత మూడు రోజుల్లోనే తులం బంగారంపై దాదాపు రూ. 5,000 వరకు పెరగడం మార్కెట్ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. నగరంలోని బులియన్ మార్కెట్‌లో తాజా ధరల ట్రెండ్ ఇలా ఉంది.
22 క్యారెట్ల బంగారం (ఆభరణాల బంగారం): 10 గ్రాములపై రూ. 800 పెరిగి రూ. 1,45,550 కి చేరింది.
24 క్యారెట్ల బంగారం (మేలిమి బంగారం): 10 గ్రాములపై రూ. 870 పెరిగి రూ. 1,58,780 వద్ద ట్రేడ్ అవుతోంది.
వెండి ధర ఎలా ఉందంటే?
బంగారం రేట్లు భగ్గుమంటుంటే, వెండి మాత్రం ఈరోజు కాస్త శాంతించింది. కిలో వెండి ధరలో ఎటువంటి మార్పు లేకుండా రూ. 3,00,000 వద్దే కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో వెండి ధరలు తగ్గుముఖం పట్టడంతో, రానున్న రోజుల్లో దేశీయంగా కూడా వెండి ధర తగ్గే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి వల్ల ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా భావించి బంగారాన్ని భారీగా కొనుగోలు చేస్తున్నారు.మరో వారంలో వివాహాల సీజన్ ప్రారంభం కానుంది. భారతీయులకు పెళ్లి అంటే బంగారం తప్పనిసరి. ఈ డిమాండ్‌ను బట్టి ధరలు మరింత ఎగబాకుతున్నాయి.ఆశ్చర్యకరంగా అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ఔన్సుకు 17 డాలర్లు తగ్గి $5038 వద్ద ఉన్నప్పటికీ, స్థానిక మార్కెట్‌లో మాత్రం డిమాండ్ కారణంగా ధరలు పెరుగుతూనే ఉన్నాయి.
పైన పేర్కొన్న ధరలు ఈరోజు (బుధవారం) ఉదయం 7 గంటల సమయానికి ఉన్నవి. బులియన్ మార్కెట్ అస్థిరత కారణంగా మధ్యాహ్నానికి ధరలు మారే అవకాశం ఉంటుంది. కావున కొనుగోలు చేసే ముందు మీ స్థానిక జ్యువెలరీ షోరూమ్‌లో ధరను సరిచూసుకోవడం ఉత్తమం.