Vande Bharat Express: ప్రయాణికులకి అలర్ట్.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఛార్జీలు తగ్గుతాయా..?
Vande Bharat Express: భారతీయ రైల్వే చరిత్రలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఒక సంచలనమని చెప్పవచ్చు.
Vande Bharat Expres: ప్రయాణికులకి అలర్ట్.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఛార్జీలు తగ్గుతాయా..?
Vande Bharat Express: భారతీయ రైల్వే చరిత్రలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఒక సంచలనమని చెప్పవచ్చు. సాధారణ రైళ్లకి ప్రత్యామ్నాయంగా ఈ సెమీ-హై-స్పీడ్ రైళ్లని ప్రవేశపెట్టారు. వీటి ద్వారా తక్కువ సమయంలో గమ్యాన్ని చేరుకోవచ్చు. వీటి వేగం మిగతా రైళ్ల కంటే ఎక్కువగా ఉంటుంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో 23 రైళ్లు అందుబాటులోకి రాగా మరికొన్ని త్వరలో ప్రారంభం కానున్నాయి. ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికీ అధిక ధరల కారణంగా ప్రయాణికులు ఇందులో ప్రయాణించడం లేదు.
వాస్తవానికి శతాబ్ది ఎక్స్‌ప్రెస్ లాంటి రైళ్లకి ప్రత్యామ్నాయంగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ నడుపుతున్నారు. కానీ అధిక ఛార్జీల కారణంగా చాలా మంది ప్రజలు వందే భారత్‌కు బదులుగా మళ్లీ శతాబ్ది వైపే మళ్లుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వందే భారత్ రైలు ఛార్జీలను తగ్గించే అంశం తెరపైకి వస్తోంది. మీడియా నివేదికల ప్రకారం వందే భారత్ రైలు ఛార్జీలు 5 నుంచి 10 శాతం వరకు తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఈ సెమీ-హై స్పీడ్ రైలులో సాధారణ చైర్ కార్ లేదా ఎగ్జిక్యూటివ్ క్లాస్ రెండింటి ఛార్జీలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వందే భారత్ రైలు ఛార్జీలను తగ్గించాలని రైల్వే శాఖ చర్చిస్తోంది.
అధిక ధరల కారణంగా ప్రజలు కోరుకుంటున్నప్పటికీ వందే భారత్ రైలులో ప్రయాణించడం లేదు. దీనికి బదులుగా వేరే రైళ్లని ఎంచుకుంటున్నారు. కారణం అందులో ధరలు తక్కువ ఉండటమే. ఇలాంటి పరిస్థితుల్లో వందే భారత్ రైలు ఛార్జీలను తగ్గించే అంశం తెరపైకి వస్తోంది. కానీ దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మీడియా సమాచారం ప్రకారం వందేభారత్‌ను కెపాసిటీ కంటే తక్కువ ప్రయాణికులతో నడుపుతున్నట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు. సాధారణ రైళ్ల కంటే దీని ధర మూడు రెట్లు ఎక్కువ. మధ్యతరగతి కుటుంబానికి ఇంత ఛార్జీ చెల్లించడం కొంచెం కష్టమైన పనే.