స్థిరంగా బంగారం ధరలు.. షాకిచ్చిన వెండి!

నిన్న భారీగా తగ్గిన బంగారం ధరలు ఈరోజు 08-11-2019 స్థిరంగా నిలిచాయి. వెండి ధరలు మాత్రం భారీగా పెరిగాయి.

Update: 2019-11-08 02:35 GMT

నిన్న భారీగా తగ్గిన బంగారం ధరలు ఈరోజు ఎటువంటి మార్పులూ లేకుండా స్థిరంగా నిలిచాయి. 08.11.2019 శుక్రవారం పది గ్రాముల బంగారం ధర గురువారం ధరలతో పోలిస్తే నిలకడగా ఉంది. కాగా, వెండి ధరలు మాత్రం పైకెగశాయి.

శుక్రవారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర స్థిరంగా ఉంది. దీంతో పది గ్రాముల ధర 39,900 రూపాయల వద్ద నిలిచింది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా మార్పులు లేకుండా 36,580 రూపాయల వద్ద ఉంది. అయితే, వెండి ధరలు మాత్రం పెరిగాయి.  దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 250 రూపాయలు తగ్గి 48,750 రూపాయలకు చేరింది. విజయవాడ, విశాఖపట్నంలలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 39,900 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 36,580 రూపాయలుగా నమోదయ్యాయి.

కాగా, ఢిల్లీ మార్కెట్ లో ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడా బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం  38,550 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల ధర కూడా 37,350 రూపాయల వద్ద కదల కుండా ఉంది. ఇక వెండి ధర ఇక్కడా కేజీకి 250 రూపాయలు పెరిగింది. దీంతో 48,750 రూపాయలకు చేరింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 08.11.2019 శుక్రవారం  ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయ మార్కెట్లలో కదలాడే ధరలు.. దేశీయంగా ఉండే డిమాండ్ ఆధారంగా బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. బంగారం వెండి ధరలు స్థానిక మార్కెట్లలో కొద్దిగా అటూ ఇటూ గా మార్పులకు లోనయ్యే అవకాశం ఉంటుంది


Tags:    

Similar News