Gold Rate Today: మహిళలకు నిజంగా చేదు వార్త.. లక్ష రూపాయలకు చేరుకున్న పసిడి ధర..!!
Gold Rate Today: మహిళలకు బ్యాడ్ న్యూస్. బంగారం ధర మళ్లీ భారీగా పెరిగింది. తులం పసిడి ధర లక్ష రూపాయలకు చేరుకుంది. నేడు జూన్ 6వ తేదీ శుక్రవారం బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్..స్థిరంగా బంగారం ధరలు..నేటి ధరలు ఎలా ఉన్నాయంటే ?
Gold Rate Today: అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం..ఈ రెండు దేశాల పరిస్థితి మెరుగుపడేందుకు బదులుగా మరింత దిగజారుతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ స్థాయిలో పెరుగుతున్న ఉద్రిక్తత పరిస్థితుల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పెట్టుబడిదారులు సాంప్రదాయ సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు చూపిస్తున్నారు. దీని కారణంగా బంగారం ధరలు భారీగాపెరగుతున్నాయి. బంగారం ఇన్వెస్టర్లకు మంచి ఎంపికగా మారింది. వెండి ధరలు కూడా ఎగబాకాయి.
నేడు జూన్ 6వ తేదీ శుక్రవారం 24క్యారెట్ల బంగారం ధర తులానికి నిన్నటితో పోల్చితే సుమారు 400 రూపాయలు పెరిగింది. ప్రస్తుతం 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 99,610 వద్దకొనసాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం లక్ష రూపాయల మార్క్ ను చేరింది. ఇప్పుడు తులం బంగారాన్ని కొనుగోలు చేసినట్లయితే జీఎస్టీ, ఇతర ఛార్జీలతో కలిపి లక్ష రూపాయలు దాటుతోంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 91,130కి చేరుకుంది. అదే సమయంలో వెండి కూడా కిలోకు భారీగానే పెరిగింది. నిన్న ఒక్క రోజు 3వేలకు పైగా పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 1,14,100కు చేరుకుంది.