Gold Rate Today: చుక్కలు చూపిస్తున్న పసిడి ధరలు..తులం ధర హైదరాబాద్ లో ఎంతుందో తెలుసా?
Gold Rate Today: పసిడి ప్రియులకు భారీ షాక్..మరో మారు లక్ష మార్క్ దాటిన తులం పసిడి ధర..!!
Gold Rate Today: బంగారం ధరలు మళ్లీ భారీగా పెరిగాయి. రూ. లక్ష మార్క్ కు చేరువయ్యాయి. అంతర్జాతీయంగా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సుంకాలు పెంచడంతో వాణిజ్య యుద్ధ భయాలు, సురక్షిత పెట్టుబడి డిమాండ్ పెరగడమే దీనికి కారణం. హైదరాబాద్ లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 3370 డాలర్ల స్థాయిలో ఉంది. వెండి రేటు ఔన్సుకు 34.54 డాలర్ల వద్ద ఉంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 85,88 వద్ద స్థిరంగా కదలాడుతోంది. ఈ పెరుగుదలకు ముఖ్య కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను 25శాతం నుంచి 50శాతానికి చేర్చడమే. ఇదే అంతర్జాతీయంగా అనిశ్చితిని స్రుష్టించింది. దీంతో మరోసారి వాణిజ్య యుద్ధభయాలు పెరిగాయి. ఈ విధంగా సురక్షిత పెట్టుబడి సాధనంగా మరోసారి బంగారానికి డిమాండ్ పెరిగింది. ఈవిధంగా పెట్టుబడులు పెరగడంతో పసిడి ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీంతో మరోసారి తులం బంగారం ధర రూ. 1లక్ష మార్కును తాకవచ్చని అంచనాలు కనిపిస్తున్నాయి.
దేశీయంగా బంగారం ధరల విషయానికి వస్తే హైదరాబాద్ లో బంగారం ధర మళ్లీ పెరిగింది. 22 క్యారెట్ల బంగారం ధర తులం మళ్లీ రూ. 100 పెరగడంతో రూ. 90, 900కు చేరుకుంది. కిందటి రోజు రూ. 200, అంతకుముందు రోజు రూ.1400 పెరిగింది. 24క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 110 పెరిగి రూ. 99,170 కి ఎగబాకింది. వెండి ధర కూడా రోజుల తర్వాత భారీగా పెరిగింది. ఒక్కరోజులోనే రూ. 1900 పెరగడంతో కిలో ప్రస్తుతానికి రూ. 1.13 లక్షలకు చేరుకుంది.