Gold Rate Today: బంగారం ధరల తగ్గుదలకు బ్రేక్..మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు
Gold Rate Today: బంగారం ధరలు వరుసగా ఐదో రోజు కూడా బలంగా తగ్గాయి. మే నెల 4వ తేదీ, ఆదివారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 95,170 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 87,550 పలుకుతోంది, ఒక కేజీ వెండి ధర రూ. 99,000 పలుకుతోంది. బంగారం ధరలు తగ్గడానికి ప్రధానంగా అంతర్జాతీయంగా ఉన్నటువంటి వాణిజ్య పరిస్థితులు కారణం అని చెప్పవచ్చు.
బంగారం ధరలు ఒక దశలో విపరీతంగా పెరిగి ఒక లక్ష రూపాయల స్థాయికి చేరుకున్నాయి. అక్కడ నుంచి బంగారం ధర స్థిరంగా తగ్గడం ప్రారంభించింది. ప్రస్తుతం బంగారం ధరలు ఆల్ టైం రికార్డ్ స్థాయికి అన్న 6000 రూపాయల తక్కువ ధర పలుకుతున్నాయి. బంగారం ధరలు గత ఏడాది కాలంగా గమనించినట్లయితే భారీగా పెరిగాయి. గత సంవత్సరం ఏప్రిల్ నెలలో బంగారం ధర కేవలం 70 వేల రూపాయల సమీపంలోనే ఉంది.
కానీ ఇప్పుడు ఒక లక్ష రూపాయల సమీపానికి చేరుకుంది అంతే దాదాపు 30 వేల రూపాయలు పెరిగినట్లు గమనించవచ్చు. బంగారం ధరలు భారీగా పెరగడానికి ప్రధాన కారణం అమెరికా చైనా మధ్య ఉన్నటువంటి వాణిజ్య ఉద్రిక్తతలే ప్రధాన కారణంగా నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ప్రస్తుతం ఈ ఉద్రిక్తతలు నెమ్మదిగా తగ్గుతున్నాయి. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చైనా తో చర్చలు జరుపుతానని ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా బంగారం ధరలు తగ్గడం ప్రారంభించాయి.
బంగారం ధరలు తగ్గడానికి మరో ప్రధాన కారణం డాలర్ బలం పుంజుకోవడమే అని నిపుణులు పేర్కొంటున్నారు. దీనికి తోడు బంగారం ధరలు ఆల్ టైం రికార్డ్ స్థాయి నుంచి నెమ్మదిగా తగ్గడం ప్రారంభించాయి. బంగారం ధరలు తగ్గుతున్న నేపథ్యంలో పసిడి ప్రియులు బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతోని బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు కస్టమర్లు ఎక్కువగా మక్కువ చూపిస్తున్నారు. అయితే భవిష్యత్తులో బంగారం ధరలు తగ్గుతాయా లేక పెరుగుతాయా అనేది అంతర్జాతీయ వాణిజ్య పరిస్థితులు నిర్ణయిస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు.