Gold Rate:ఆగని బంగారం ధరల పరుగు..వెండి ధరలూ అదేవిధంగా..

బంగారం ధరలు అల్ టీం రికార్డు స్థాయికి చేరుకున్నాయి. రోజు రోజుకూ పెరుగుతూ వస్తున్నబంగారం ఈరోజు మరింత పెరిగింది. మరోవైపు వెండి ఈరోజు కూడా పరుగులు తీసింది.

Update: 2020-07-30 05:21 GMT
gold rate today

బంగారం ధరలు అల్ టీం రికార్డు స్థాయికి చేరుకున్నాయి. రోజు రోజుకూ పెరుగుతూ వస్తున్నబంగారం ఈరోజు మరింత పెరిగింది. మరోవైపు వెండి ఈరోజు కూడా పరుగులు తీసింది. హైదరాబాద్ లో బంగారం ధరలు పెరిగాయి. బంగారం ధరలు ఈరోజు (జూలై 30) దేశీయంగా భారీ పెరుగుదల నమోదుచేశాయి. మరో వైపు వెండి ధరలు కూడా ప్రిగాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు భారీ పెరుగుదల నమోదు చేశాయి. గురువారం (30.07.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు బుధవారం నాటి ధరల కంటే పెరిగాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 370 రూపాయలు పెరిగింది. దీంతో 50,740 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారంకూడా పది గ్రాములకు 370 రూపాయలు పెరిగింది. దీంతో 54 వేల రూపాయల రికార్డ్ మార్కును దాటి 54,310 రూపాయల వద్ద నిలిచింది.

వెండి ధరలు పెరిగాయి..

బంగారం ధరలు పెరుగుదల నమోదు చేస్తే, వెండి ధరలు కూడా పెరుగుదల నమోదు చేశాయి. కేజీ వెండి ధర బుధవారం నాటి ధరల కంటే కాస్త పెరిగింది. ఈరోజు 50రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 66 వేల రూపాయల గరిష్ట రికార్డు ధరను దాటి నమోదు చేసింది. దీంతో కేజీ వెండి ధర 66,050 రూపాయల వద్ద నమోదు అయింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి.పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 370 రూపాయలు పెరిగింది. దీంతో 50,740 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారంకూడా పది గ్రాములకు 370 రూపాయలు పెరిగింది. దీంతో 54 వేల రూపాయల రికార్డ్ మార్కును దాటి 54,310 రూపాయల వద్ద నిలిచింది.

దేశరాజధాని ఢిల్లీలో..

ఢిల్లీలో కూడా బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర బుధవారం ధరతో పోలిస్తే 250 రూపాయలు పెరిగి 51,500 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా బుధవారం ధరతో పోలిస్తే 250 రూపాయలు పెరిగింది. దీంతో 52,700 రూపాయలుగా నమోదు అయింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా పెరుగుదల నమోదు చేశాయి. దీంతో 66 వేల రూపాయల గరిష్ట రికార్డు ధరను దాటి పైకెగశాయి. దీంతో కేజీ వెండి ధర 66,050 రూపాయల వద్ద నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 30-07-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News