Gold Rate: బంగారం పైపైకే.. వెండి కూడా అదే దారిలో!

K V D Varma
Published on: 27 July 2020 8:08 AM IST
Gold rate price 27th July
X
gold and silver rate today

బంగారం భాగ్గుమంటూనే ఉంది. మరోవైపు వెండి ఈరోజు కాస్త పెరిగింది. హైదరాబాద్ లో బంగారం ధరలు పెరిగాయి. బంగారం ధరలు ఈరోజు (జూలై 27) దేశీయంగా భారీ పెరుగుదల నమోదుచేశాయి. మరో వైపు వెండి ధరలు కొద్దిగా పైకెగసాయి

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు పెరుగుదల నమోదు చేశాయి. సోమవారం (27.07.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు శనివారం నాటి ధరల కంటే పెరిగాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 260 రూపాయలు పెరిగింది. దీంతో 49,050 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారంకూడా పది గ్రాములకు 260 రూపాయలు పెరిగింది. దీంతో 53 వేల రూపాయల రికార్డ్ మార్కును దాటి 53,480 రూపాయల వద్ద నిలిచింది.

వెండి ధరలు పెరిగాయి..

బంగారం ధరలు పెరుగుదల నమోదు చేస్తే, వెండి ధరలుకాస్త పెరుగుదల నమోదు చేశాయి. కేజీ వెండి ధర శనివారం నాటి ధరల కంటే కొద్దిగా పెరిగింది. ఈరోజు 160 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 60 వేల రూపాయల గరిష్ట రికార్డు ధరను దాటి నమోదు చేసింది. దీంతో కేజీ వెండి ధర 61,210 రూపాయల వద్ద నమోదు అయింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 260 రూపాయలు పెరిగింది. దీంతో 49,050 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారంకూడా పది గ్రాములకు 260 రూపాయలు పెరిగింది. దీంతో 53 వేల రూపాయల రికార్డ్ మార్కును దాటి 53,480 రూపాయల వద్ద నిలిచింది.

దేశరాజధాని ఢిల్లీలో..

ఢిల్లీలో కూడా బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర శనివారం ధరతో పోలిస్తే 410 రూపాయలు పెరిగి 49,960 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా శనివారం ధరతో పోలిస్తే 410 రూపాయలు పెరిగింది. దీంతో 51,160 రూపాయలుగా నమోదు అయింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా కొద్దిగా పెరుగుదల నమోదు చేశాయి. దీంతో 60 వేల రూపాయల గరిష్ట రికార్డు ధరను దాటి పైకెగశాయి. దీంతో కేజీ వెండి ధర 61,210 రూపాయల వద్ద నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 27-07-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.


K V D Varma

K V D Varma

Next Story