Gold Rate: బంగారం ధరలు మరికాస్త కిందికి.. వెండి ధరల భారీ పతనం..!

Gold Rate: బంగారం ప్రియులకు శుభవార్త. ఈరోజు కూడా బంగారం ధరలలో తగ్గుదల కనిపించింది. ఇక వెండి ధరలు భారీస్థాయిలో పడిపోయాయి. ఈరోజు దేశంలో వివిధ ప్రాంతాలలో బంగారం, వెండి ప్రారంభ ధరలు ఇలా ఉన్నాయి

Update: 2021-01-29 00:50 GMT

ఈరోజు బంగారం ధరలు 

బంగారం ధరలు బుధవారం తగ్గుదల కనబరిచాయి. దీంతో శుక్రవారం మార్కెట్లు తగ్గుదలతొ ప్రారంభం అవుతున్నాయి. బంగారం ధరలు గురువారం ప్రారంభ ధరలతొ పోలిస్తే కొద్దిగా తగ్గాయి. బంగారం ధరలు ఈరోజు (29.01.2021) తగ్గుదల కనబరిచాయి. మరో వైపు వెండి ధరలు కొద్దిపాటి తగ్గుదల నమోదు చేశాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు స్వల్పంగా కిందికి దిగివచ్చాయి. శుక్రవారం (29.01.2021) బంగారం ధరలు గురువారం నాటి ప్రారంభ ధరలకంటె కొద్దిగా తగ్గాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 100 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 45,650 రూపాయలుగా నమోదు అయింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా 50 వేలరూపాయల మార్క్ వద్ద నిలిచింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం 100 రూపాయల స్వల్ప తగ్గుదల నమోదు చేసి 50,130 రూపాయలుగా నిలిచింది.

వెండి ధరలు భారీ తగ్గుదల..

బంగారం ధరలు కాస్త తగ్గితే.. వెండి ధరలు భారీగా పడిపోయాయి. కేజీ వెండి ధర గురువారం నాటి ప్రారంభ ధరకంటె భారీగా ఏకంగా 4700 రూపాయలు తగ్గింది. దీంతో 66 వేల రూపాయల స్థాయికి ఒక్కసారిగా వెండి ధరలు కుప్పకూలాయి. ఈరోజు వెండి ప్రారంభ ధర కేజీకి 66,000 రూపాయల వద్దకు చేరుకుంది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు స్వల్పంగా కిందికి దిగివచ్చాయి. శుక్రవారం (29.01.2021) బంగారం ధరలు గురువారం నాటి ప్రారంభ ధరలకంటె కొద్దిగా తగ్గాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 100 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 45,650 రూపాయలుగా నమోదు అయింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా 50 వేలరూపాయల మార్క్ వద్ద నిలిచింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం 100 రూపాయల స్వల్ప తగ్గుదల నమోదు చేసి 50,130 రూపాయలుగా నిలిచింది.

దేశరాజధాని ఢిల్లీలో..

మరోవైపు ఢిల్లీలో బంగారం ధరలు తగ్గుదల కనబరిచాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర గురువారం నాటి ప్రారంభ ధర కంటె 100 రూపాయలు తగ్గి 47,800 రూపాయల వద్ద నిలిచాయి. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గుదల కనబరిచింది. ఇక్కడ 110 రూపాయలు తగ్గి 52,140 రూపాయల వద్దకు చేరుకుంది. ఇక ఢిల్లీ లో వెండి ధరల విషయానికి వస్తే, ఇక్కడ వెండి ధరలు తగ్గుదల బాటలోనే నడిచాయి. కేజీ వెండి ధర గురువారం నాటి ప్రారంభ ధర కంటె 200 రూపాయలు తగ్గుదల నమోదు చేసి 66 వేల రూపాయల స్థాయిలో వెండి ధరలు నిలిచాయి. దీంతో కేజీ వెండి ధర 66,000 రూపాయలుగా నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 29-01-2021 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News