Gold Rate: తగ్గుతూ వస్తున్నబంగారం ధరలు..స్వల్పంగా పెరిగిన వెండి ధరలు..ఈరోజు రేట్లివే!

Gold Rate: బంగారం ధరలు తగ్గుదల బాటలోనే ఉన్నాయి. వెండి స్వల్పంగా పెరిగింది.

Update: 2020-08-27 03:29 GMT

మూడురోజులుగా తగ్గుతూ వస్తున్నబంగారం ధరలు ఈరోజు కూడా మరికొంత తగ్గాయి. హైదరాబాద్ లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టినట్టే కనిపిస్తున్నాయి.. బంగారం ధరలు ఈరోజు (ఆగస్టు 27) దేశీయంగా కిందికి కదిలాయి. మరో వైపు వెండి ధరలు కూడా తగ్గుతూ వస్తున్నాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు కూడా కొద్దిగా తగ్గాయి. గురువారం (27.08.2020) బంగారం ధరలు బుధవారం ధరలతో పోలిస్తే తగ్గుదల నమోదు చేశాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 290 రూపాయలు తగ్గి 49,190 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారంకూడా పది గ్రాములకు 390 రూపాయలు తగ్గుదల నమోదు చేసింది. దీంతో 53,660 రూపాయల వద్ద నిలిచింది.

స్వల్పంగా పెరిగిన వెండి ధరలు ..

బంగారం ధరలు తగ్గితే, వెండి ధరలు స్వల్పంగా పెరుగుదల నమోదు చేశాయి. కేజీ వెండి ధర బుధవారం నాటి ధరల కంటే పెరుగుదల నమోదు చేశాయి. ఈరోజు 50 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 65వేల రూపాయల స్థాయికి వెండి ధరలు కదిలాయి. దీంతో కేజీ వెండి ధర 65,550 రూపాయల వద్ద నమోదు అయింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 290 రూపాయలు తగ్గి 49,190 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారంకూడా పది గ్రాములకు 390 రూపాయలు తగ్గుదల నమోదు చేసింది. దీంతో 53,660 రూపాయల వద్ద నిలిచింది.

దేశరాజధాని ఢిల్లీలో..

మరోవైపు ఢిల్లీలో కూడా బంగారం ధరలు కాస్త కిందికి కదిలాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర బుధవారం నాటి ధర కంటె 400 రూపాయలు తగ్గింది. దీంతో 49,850 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా బుధవారం నాటి ధర కంటె 490 రూపాయలు తగ్గింది. దాంతో 54,380 రూపాయలకు దిగివచ్చింది. ఇక వెండి ధరలు.. కేజీ వెండి ధర బుధవారం నాటి ధరల కంటే పెరుగుదల నమోదు చేశాయి. ఈరోజు 50 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 65వేల రూపాయల స్థాయికి వెండి ధరలు కదిలాయి. దీంతో కేజీ వెండి ధర 65,550 రూపాయల వద్ద నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 27-08-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. 

Tags:    

Similar News