బంగారం ధరలు అటూ ఇటూ కదులుతూ వస్తున్నాయి. నిన్న భారీగా తగ్గిన బంగారం ధరలు ఈరోజు భారీగా పైకెగాశాయి. భారీ పెరుగుదలను నమోదు చేశాయి. పది గ్రాముల బంగారం దాదాపు ఏడువందల రూపాయల వరకూ పెరుగుదలను నమోదు చేసింది. ఇక వెండి ధర మాత్రం స్థిరంగా నిలిచింది.
హైదరాబాద్ లో బంగారం ధరలు భారీ పెరుగుదల నమోదు చేశాయి. గురువారం (19.03.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు బుధవారం నాటి ధర కంటే 690 రూపాయల పెరుగుదల నమోదు చేసి 39,390 రూపాయలుగా నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా ధర కూడా పది గ్రాములకు 670 రూపాయల పెరుగుదలతో 42,970 రూపాయలు నమోదు చేసింది.
భారీగా తగ్గిన వెండి ధరలు...
బంగారం ధరలు పెరిగిపోతే, పాటు వెండి ధరలు మాత్రం మార్పులు లేకుండా కొనసాగుతున్నాయి. వెండి ధర స్థిరంగా కేజీ వెండి ధర 41,780 రూపాయల వద్ద నిలిచింది.
విజయవాడ, విశాఖపట్నం లలో..
ఇక విజయవాడ, విశాఖపట్నం లలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. ఇక్కడ కూడా 22 క్యారెట్లు పది గ్రాములకు నిన్నటి ధర కంటే 690 రూపాయల పెరుగుదల నమోదు చేసి 39,390 రూపాయలుగా నిలిచాయి. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా పది గ్రాములకు 670 రూపాయల పెరుగుదలతో 42,970 రూపాయలు నమోదు చేసింది. అయితే, వెండి ధరలు మాత్రం మార్పులు లేకుండా కేజీకి 41,780 రూపాయలుగా నమోదైంది.
దేశ రాజధాని ఢిల్లీలో..
ఇక, దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధరలు భగ్గు మన్నాయి. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 700 రూపాయల పెరుగుదలతో 41,450 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 700 రూపాయల పెరుగుదలతో 40,250 రూపాయలకు చేరుకుంది. ఇక కేజీ వెండి ధర ఇక్కడ కూడా మార్పులు లేకుండా 47,800 రూపాయలుగా ఉంది.
ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 19-03-2020 ఉదయం 8 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.